Home తాజా వార్తలు పూజకు వెళ్లినా …. రాద్ధాంతం చేస్తున్నారు : గవర్నర్

పూజకు వెళ్లినా …. రాద్ధాంతం చేస్తున్నారు : గవర్నర్

Governor Comments on Opposition Parties

హైదరాబాద్ : తాను పూజకు వెళ్లిన ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌గా తన బాధ్యతలను తాను అంకితభావంతో నిర్వర్తిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అన్ని శాఖలపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను వ్యక్తిగతంగా పరిశీలించినట్టు ఆయన వెల్లడించారు. ఎవరో చెబితే తాను నమ్మనని, అన్ని విషయాలు తనకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం కృషి జరుగుతుందని నరసింహన్ అన్నారు. తెలంగాణ మోడల్ హెల్త్ కేర్ సెంటర్‌గా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. నారాయణగూడలోని డయగ్నోసిస్ సెంటర్‌ను గురువారం నరసింహన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకే చోట అన్ని పరీక్షలు నిర్వహించి 24గంటల్లో ఫలితాలు ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

Governor Comments on Opposition Parties