Home జాతీయ వార్తలు హోంమంత్రి అమిత్ షాతో నరసింహన్ భేటీ

హోంమంత్రి అమిత్ షాతో నరసింహన్ భేటీ

Narasimhanఢిల్లీ : కేంద్ర హోంమంత్రి , బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు గవర్నర్ నరసింహన్ వివరించారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ స్నేహపూర్వకంగా సాగుతున్నట్టు గవర్నర్ అమిత్ షాకు తెలిపారు. హైదరాబాద్ లోని భవనాల సమస్యను పరిష్కరించామని ఆయన అమిత్ షాకు తెలిపారు. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్ పేర్కొన్నారు.

Governor Narasimhan Meets Home Minister Amit Shah