Home తాజా వార్తలు ప్రియాంక రెడ్డి హత్య దురదృష్టకరం : గవర్నర్

ప్రియాంక రెడ్డి హత్య దురదృష్టకరం : గవర్నర్

Governor Tamilisai

 

హైదరాబాద్: ప్రియాంక రెడ్డి హత్య దురదృష్టకరమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో గవర్నర్ తమిళిసై ప్రియాంక రెడ్డి ఇంటికి చేరుకొని తన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీ నిర్భయ సంఘటన తరువాత దేశవ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారాడంతో గవర్నర్‌ తమిళిసై తీవ్రంగా స్పందించారు. అనంతంరం ఈ కేసును ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తుంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. మరోవైపు ప్రియాంక హత్యపై స్పదించిన జాతీయ మహిళ కమిషన్ పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను సూచించారు.

Governor Tamilisai consoles Priyanka Reddy Parents