Friday, April 19, 2024

ధాన్య సేకరణపై గవర్నర్ సంతృప్తి

- Advertisement -
- Advertisement -

Governor Tamilsai visited Nalgonda district

నల్లగొండ జిల్లాలో గతేడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
సేకరణ సజావుగా సాగుతున్నది, ఇంతవరకు 72% జరిగింది : గవర్నర్ తమిళిసై

మనతెలంగాణ/నల్లగొండ : నల్లగొండ జిల్లాలో వానాకాలం పంట 72 శాతం సేకరణ జరిగిందని, 249 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు సజావుగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో ఆమె విస్తృతంగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సీజన్‌లో ఏర్పాటు చేసిన 182 కొనుగోలు కేంద్రాల కంటే ఎక్కువ అని వెళ్లడించారు. ఇటీవల కొంత వాతావరణ సమస్యలు అకస్మాత్తుగా ఉత్పన్నమైన్నప్పటికి ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగటం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. నల్లగొండ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనగోలు కేంద్రాలు సందర్శించారు. తొలుత నల్లగొండ పట్టణంలో ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన పిఏసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడారు. మధుసూదన్ రెడ్డి , మల్లమ్మ అనే రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా , ఎన్ని బస్తాల ధాన్యం దిగుమతి వచ్చింది అని రైతులను అడిగి తెలుసుకన్నారు. అకాల వర్షం కారణంగా తేమ వాతం వచ్చే వరకు కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టినట్లు తెలిపారు. గవర్నర్ వారితో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు పరిశీలించి మీతో మాట్లాడటానికి వచ్చానని తెలిపారు. రైతు మల్లమ్మతో నేను తెలుసా రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ అని పరిచయం చేసుకున్నారు.

అనంతరం అనిశెట్టి దుప్పలపల్లిలో ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు.కొనుగోలు కేంద్రంలో కె. మారయ్య, ఎన్. తిరుపతయ్యలతో గవర్నర్ మాట్లాడారు. ఎన్నిరోజలు అయ్యింది, కొనుగోళ్లలో సమస్యలు ఉన్నాయా తెలుసుకున్నారు. గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయా, ఎంతమంది రైతులు ఉన్నారు అని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో రైతులతో మమేకం కావడం సంతోషంగా ఉందన్నారు. సీజనల్‌గా వచ్చే విపత్తులు రైతులను బాధపెడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహక మహిళలతో గవర్నర్ గ్రూప్‌ఫోటో దిగారు. మీపేరు ఏమిటి, … ఎన్ని ఎకరాల్లో ఎంత పండించారు… ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి ఎన్నిరోజులైయ్యింది …. అంటూ పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి నేను ఎవరో తెలుసా అంటూ ఒక మహిళా రైతుతో మాట్లాడించారు.అంతకు ముందు రహదారులు , భవనాల శాఖ అతిధి గృహంనుండి నల్లగొండ పట్టణంలోని షేర్ బంగ్లాలోని పునః ప్రతిష్టించిన శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయాన్ని ప్రారంభించారు. ధ్వజస్థంభ, శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేవాలయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఐజి , ఎస్‌పి. ఏవి. రంగనాధ్, స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజి ఎంఎల్‌సి. పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆర్‌డివో జగదీశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ నల్గొండ పట్టణంలోని వివిద కార్యక్రమాలలో పాల్గొన్నారు. హైద్రాబాద్‌నుండి ఉదయం 11.33 ని. లకు నల్లగొండ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్, డిఐజి, ఎస్పీ ఎవి. రంగనాధ్‌లు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

ఆయా కార్యక్రమాలలో గవర్నర్ వెంట డిఐజి , ఎస్పీ . ఏవి. రంగనాధ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి ప్రసాద్, డిఆర్‌డివో కాళిందిని, పౌరసరఫరాల సంస్థ డిఎం. నాగేశ్వర్‌రావు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News