Friday, March 29, 2024

టీచింగ్‌స్టాఫ్‌తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

Governor Video Conference with TeachingStaff

 

అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నాం
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్‌స్టాఫ్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని గవర్నర్ గతంలో నిర్ణయించారు. అందులో భాగంగా శుక్రవారం వరంగల్ కాకతీయ యూనివర్శిటీతో పాటు దాని అనుబంధ కాలేజీల టీచింగ్‌స్టాఫ్‌తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల స్టాఫ్‌తో రోజు విడిచి రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.

సమగ్ర సమాచారంతో బ్లూప్రింట్ తయారు చేస్తామన్నారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో విసిలు, అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్ వర్సిటీలకు ధీటుగా ప్రభుత్వ వర్సిటీల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. యూనివర్సిటీల్లో ట్రిపుల్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామని, ఎంజాయ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. కోవిడ్ నేపథ్యంలో హాస్టళ్లను ఎలా తెరవాలన్న అంశంపై చర్చిస్తున్నామన్నారు. యూనివర్సిటీల భూముల ఆక్రమణ తన దృష్టికి వచ్చిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News