Home రాష్ట్ర వార్తలు గవర్నర్ జన్మదినోత్సవం

గవర్నర్ జన్మదినోత్సవం

governorహైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ 70వ పడిలోకి అడుగిడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చ్రంద్రబాబునాయుడు గవర్నర్‌కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో నిరాడంబ రంగా జరిగిన గవర్నర్ జన్మదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణ మూర్తి, మంత్రులు బొజ్జల గోపాల కృష్ణరెడ్డి, కామినేని శ్రీనివాస్, తెలంగాణ మంత్రి కె.తారకరామా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మతో పాటు పలు వురు ప్రముఖులు హజరై పుష్పగుచ్ఛాలందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథులను గవర్నర్ సాదరంగా ఆహ్వానిం చారు. అనంతరం కేట్ కట్ చేసి తన ఆనం దాన్ని వారితో పంచుకున్నారు. నగర పోలీ సు కమీషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, మెట్రో రైల్ మేనేజిం గ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డిలతో పాటు పలువురు సీనియర్ ప్రభు త్వాధికారులు రాజ్‌భవన్‌కు విచ్చేసి గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.