Home జాతీయ వార్తలు ఇ-సిగరెట్లను నిషేధించిన కేంద్రం

ఇ-సిగరెట్లను నిషేధించిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం ఇ-సిగరెట్లను నిషేధించింది. యువతను ఆరోగ్యపరంగా దెబ్బతీస్తున్న ఇ-సిగరెట్లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, ఎగుమతి, దిగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ప్రచారం వంటివి నిషేధం పరిధిలోకి వస్తాయని మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేస్తుందని ఆమె చెప్పారు.

Govt Bans Production and Sale of e-cigarettes, Ordinance Soon
The government on Wednesday banned e-cigarettes, with Finance Minister Nirmala Sitharaman saying the habit affected youth the most.