Home జాతీయ వార్తలు ప్రభుత్వ యోచనలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణం

ప్రభుత్వ యోచనలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణం

Parliament Building

 

న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఇప్పుడున్న పార్లమెంట్ భవన నిర్మాణాన్ని అభివృ్దద్ధి చేయడం లేదా పునరుద్ధరించడం కానీ 2022 ఆగస్టు నాటికి పూర్తవుతుంది. పార్లమెంటు సెంట్రల్ హాలు అభివృద్ధి చేయడం, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం 2024 నాటికి పూర్తవుతుంది. కొత్త పార్లమెంటు భవనంలో మంత్రులు, ఎంపిల కార్యాలయాలు ఉంటాయి. ఇదో ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కేంద్ర మంత్రి హరదీప్‌సింగ్ పూరి బుధవారం చెప్పారు. ఆర్కిటెక్చర్ సంస్థల డిజైన్లు వచ్చిన తరువాత ఆర్థిక సంబంధమైన అంచనాలు రూపొందుతాయని ఆయన తెలిపారు. పార్లమెంటు ఉభయసభల చాంబర్లను ఎక్కువ మంది ఎంపిలకు సరిపడేలా తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు చెప్పారు రాష్ట్రపతి భవనం నుంచి ఢిల్లీ లోని ఇండియా గేట్ వరకు మూడు కిలోమీటర్ల మార్గాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మెగా ప్లానును గత వారం ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

పార్లమెంటు భవనం పునరుద్ధరణకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 2న అభ్యర్థించింది. ఇక్కడొక కార్యక్రమంలో పూరి మాట్లాడుతూ పార్లమెంటు ప్రస్తుత భవనాన్ని ప్రభుత్వం కూల్చేస్తుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కొత్త ప్రాజెక్టు కోసం ప్రతిపానలు ఆర్కిటెక్టు సంస్థల నుంచి ప్రభుత్వం కోరిందని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు భవనం లోని ఉత్తర, దక్షిణ బ్లాకులను మ్యూజియంలుగా మార్చవలసి ఉందని, కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని, భూగర్భ మార్గం ద్వారా పార్లమెంటుకు అనుసంధానించుకోవాలని అన్నారు. సిపిడబ్యుడి డైరక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్ ప్రభుత్వ మెగా ప్లాను లో పాలు పంచుకోడానికి 28 మంది బిడ్డర్లు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు.

Govt considering construction of new Parliament building