Home జాతీయ వార్తలు స్థానిక వ్యాప్తి దశలోనే కరోనా

స్థానిక వ్యాప్తి దశలోనే కరోనా

lockdown

 

సమూహ దశకు చేరుకోలేదు
కేంద్రం స్పష్టీకరణ
లాక్‌డౌన్ పొడిగింపు యోచన లేదు
సామాజిక మాధ్యమాల్లో వార్తలు నిరాధారమని ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా సమూ హ వ్యాప్తి దశకు చేరుకోలేదని తెలిపింది. ఒక వేళ సమూ హ వ్యప్తి దశకు చేరుకున్నప్పుడు ప్రభుత్వం ఆ విషయాన్ని తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుతానికి మనం ఇంకా ఆ దశకు చేరుకోలేదని చెప్పారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదివారం విడుదల చేసిన ఓ డాక్యుమెంట్ ఈ ప్రశ్న తలెత్తడానికి కారణమైంది. అందులో పరిమిత స్థాయిలో సమూహ వ్యాప్తి అని పేర్కొడంతో దేశవ్యాప్తంగా పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో ఈ రోజు దీనిపై లవ్ అగర్వాల్ స్పష్టత ఇచ్చారు. ‘మన దేశంలో జనసాంద్రత ఎక్కువ. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తేనే కరోనాను అరికట్టగలం. వందశాతం ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా కాల్ సెంటర్లను సంప్రదించాలి’ అని ఆయన అన్నారు.

లాక్‌డౌన్ పొడిగింపు ఆలోచన లేదు: కేంద్రం
ఇదిలా ఉండగా కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను మరికొన్ని రో జులు పొడిగించే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని కేం ద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై మీడియాలో, సా మాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిరాధారమని పే ర్కొనింది.‘అలాంటి(లాక్‌డౌన్ పొడిగింపు) ఊహాగానాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. లాక్‌డౌన్ పొడిగించే యోచనేదీ లేదు’ అని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పష్టంచేశారు. కాగా కేంద్ర ప్రెస్‌ఇన్ఫర్మేషన్ బ్యూ రో కూడా ఈ విషయాన్ని ఒక ట్వీట్‌లో తెలియజేసింది.

14 మంది వైద్య సిబ్బందికి హోం క్వారంటైన్
ఇదిలా ఉండగా ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ నర్సు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. జ్వరం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ఆ నర్సుతో పాటుగా మరో 14 మంది వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించారు. వాటిని కోవిడ్19 నిర్ధారణ పరీక్షల కోసం పంపించారు. ప్రస్తుతం ఆ 14 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

సాంగ్లిలో ఒకే ఇంట్లో 25 మందికి కరోనా!
మహారాష్ట్రలోని సాంగ్లిలో ఒకే ఇంట్లో నివసిస్తున్న మొత్తం 25 మందికి కరోనా వైరస్ సోకింది. వీరంతా చిన్న టి ఇంట్లో నివసిస్తూ ఉండడంతోనే కరోనా వైరస్ వేగంగా వీరికి వ్యాప్తి చెందిందని అధికారులు చెబుతున్నారు. మొదట్లో సౌదీ అరేబియానుంచి వచ్చిన కుటుంబంలోని నలుగురికి ఈ నెల 23న కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే వారం రోజుల్లోనే కుటుంబంలోని మిగతా 21 మందికి ఈ వైరస్ సోకింది. వైరస్ సోకిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇస్లాంపూర్ తహసీల్‌కు చెందిన వీరంతా ఒకే పెద్ద కుటుంబానికి చెందిన వారని, వీరంతా కిక్కిరిసి ఉండే ఇంట్లో ఉంటున్నారని జిల్లా కలెక్టర్ అభిజీత్ చౌదరి చెప్పారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వీరంతా ఇస్లాంపూర్ ప్రాంతంలో పక్కపక్కనే నివసిస్తున్నారని జిల్లా సివిల్ సర్జన్ సిఎస్ సలుంఖే చెప్పారు. కుటుంబంలోని మెజారిటీ సభ్యులు రోజంతా ఒకరితో మరొకరు టచ్‌లో ఉంటారని, అందువల్లనే వారంతా వైరస్‌కు లోనయ్యారని ఆయన చెప్పారు. అయితే రోగులంతా ఒకే కుటుంబానికి చెందిన వారయినందున చికిత్స అందించడం సులువవుతుందని ఆయన చెప్పారు. అంతేకాదు, వీరందరికీ వైరస్ సోకినట్లు తెలియగానే మిగతా గ్రామస్థులంతా ఇళ్లలోనే ఉంటున్నారని ఆయన చెప్పారు. అయితే ఈ వైరస్ మిగతా వారెవరికీ వ్యాపించకపోవడం శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ చెప్పారు. కుటుంబసభ్యులందరినీ ప్రస్తుతం సాంగ్లీలోని ఐసొలేషన్ సెంటర్‌లో చేర్చారని, వారందరికీ చికిత్స కొనసాగుతోందని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చౌదరి చెప్పారు.

Govt denies lockdown extension, says no such plan