సినిమా థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన సడలించిన కేంద్రం
ఈతకొలనులకు అందరూ వెళ్ళొచ్చు
స్విమ్మింగ్‌పూల్స్‌కు అనుమతి
ఫిబ్రవరి నెలకు కొత్త మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ మార్గదర్శకాలను పొడిగించింది. నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు వర్తిస్తాయని తెలిపింది. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండడంతో మరికొన్ని ఉపశమనాలు కల్పి స్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవా రం మార్గదర్శకాలు విడుదల చేశారు. గతంలో 50 శాతం ఆకుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతించిన కేంద్రం.. ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థంతో తెరుచుకోవచ్చని తెలిపింది. అలాగే క్రీడాకారులే కాకుండా అందరూ స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లేందుకు అనుమతించింది.
ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వచ్చే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడిగా విడుదల చేస్తాయని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా, వినోద, విద్యా, సాం స్కృతిక సంబంధిత సభలు, సమావేశాలకు హా లు సామర్థంలో 50 శాతం (200 మందికి మిం చరాదు) వరకు గతంలో అనుమతించిన కేంద్రం తాజాగా ఆ పరిమితిని సడలించింది. దీనిపై ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతికి అవకాశం కల్పించింది. అలాగే ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది.
కాగా 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశంలో గత నాలుగు నెలలుగా యాక్టివ్ కేసు లు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. కంటైన్మెంట్ వ్యూహం కఠినంగా అమలు చేయడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. కాగా కంటైన్మెంట్ జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. నిరంతరం నిఘా, పర్యవేక్షణ కొనసాగిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కోరింది. మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను మరింత ప్రోత్సహించాల్సిన అవరం ఉందని అభిప్రాయపడింది.