Home జాతీయ వార్తలు డిసెంబర్ 1లోపు ప్రభుత్వం ఏర్పాటు: సంజయ్ రౌత్

డిసెంబర్ 1లోపు ప్రభుత్వం ఏర్పాటు: సంజయ్ రౌత్

 

ముంబయి: డిసెంబర్ 1వ తేదీ లోపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని శివ సేన ఎంపి సంజయ్ రౌత్ పేర్కొన్నారు. గురువారం ఎంపి మాట్లాడుతూ.. త్వరలో ముంబయిలో శివ సేన, కాంగ్రెస్, ఎన్ సిపి మూడు పార్టీలు సమావేశం కానున్నాయని, ఈ సందర్భంగా కూటమి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, నిన్న(బుధవారం) ఎన్ సిపి ఛీఫ్ శరద్ పవార్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు, ఎన్ సిపి నాయకులు భేటీ అయిన విషయం తెలిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ స్థాపన విషయంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. అలాగే 50-50 ఫార్ములా ఒప్పందంపై కూడా చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎన్ సిపి అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ జార్ఖండ్ తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.

Govt Formation Will Be Complete Before Dec 1: Raut