Saturday, April 20, 2024

చుట్టూ ఉన్న గాలితో, తుంపర్లతో జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

Govt of India amends Covid-19 clinical management protocol

కేంద్ర ప్రభుత్వ తాజా కొవిడ్ ప్రోటోకాల్

న్యూఢిల్లీ : గాలి ద్వారానే కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ ప్రోటోకాల్‌ను వెలువరించింది. కొవిడ్ బారిన పడకుండా తీసుకోవల్సిన చర్యల గురించి వివరించే నిబంధనలలో మార్పులు చేర్పులు చేస్తూ కేంద్రం బుధవారం కొవిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను వెలువరించింది. కరోనా సోకిన మనిషి మాట్లాడినప్పుడు లేదా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందనేది సాధారణ స్థాయి అంశం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గాలి ద్వారా, తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్థారించింది. దీనితో ఇంతకు ముందటి ప్రోటోకాల్‌ను సవరిస్తూ తాజా ప్రోటోకాల్ వెలువరించారు. గాలిద్వారా వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉన్నందున సంబంధిత జాగ్రత్తలపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఇక బ్లాక్ కూడా విజృంభిస్తున్న దశలో దీనికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలను వెలువరించారు. కరోనా చికిత్స దశలో అతిగా స్టెరాయిడ్స్ వాడరాదని తెలియచేసే అంశాన్ని పొందుపరుస్తూ సరికొత్త ప్రోటోకాల్ వెలువరించారు. కరోనా సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపర్లు పది మీటర్ల దూరంలో ఉండే వారికి కూడా సోకేలా వైరస్ కణాలు గాలిలో వ్యాపిస్తాయని ఇటీవలే ఆరోగ్య విషయాల ముఖ్య సలహాదారు తమ మార్గదర్శకాలలో తెలిపారు. ఇక మనిషికి మనిషికి మధ్య 1 మీటరు కన్నా తక్కువ దూరం ఉంటే, వారిలో ఎవ్వరికి వైరస్ ఉన్నా ఇతరులకు మాటలు , నోటి తుంపర్లు ద్వారా సోకుతుందని ఇప్పటి పరిశీలనలలో స్పష్టం అయింది. కళ్లు, ముక్కు నోటిద్వారా వైరస్ సంక్రమిస్తుంది. గాలి వెలుతురుఉ ఎక్కువగా లేని ప్రాంతాలు, కిక్కిరిసి ఉండే లోపలి ప్రదేశాలు , ఎక్కువగా ఒకేచోట జనం ఎక్కువ సేపు ఉన్నట్లు అయితే ఆయా చోట్ల లాలాజల తుంపర్లు ఎక్కువగా నిలిచిపోతాయి. ఇది ఎక్కువగా వైరస్ వ్యాప్తికి దారితీస్తుందని ఇప్పటి మార్గదర్శకాలలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News