Thursday, April 25, 2024

తెలంగాణలో కరోనా విజృంభణ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

ts-govt

 

హైదరాబాద్‌ః రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలపాలు జరపాలని తెలిపింది. ఓ వారం 50 శాతం.. మరోవారం 50 శాతం ఉద్యోగులతో కార్యాలయాలు పని చేయాలని పేర్కొంది. అధికారుల డ్రైవర్లు పార్కింగ్‌లో కాకుండా పేషీలో ఉండాలని, లిఫ్టులో ముగ్గురి కంటే ఎక్కువ మంది వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయాల్లో ఏసీలు వాడకుండా ఉండడం మంచిదని సూచించింది. డ్యూటీలు లేని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్‌ని విడిచి వెళ్లొద్దని, అనారోగ్య సమస్యలున్నవారు లీవ్‌లు ఉపయోగించువోవాలని సూచించింది. ఈ నెల 22వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు ప్రభుత్వ మార్గదర్శకాలు అమలుకానున్నాయి.

Govt Offices to work with 50% Employees: TS Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News