* ఇప్పటికే పూర్తైన బ్యాలెట్ పేపర్ల సేకరణ
* సిబ్బంది జాబితా కోసం రంగం సిద్ధం
* జాబితా పంపాలంటూ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు
పంచాయితీ ఎన్నికల నిర్వహణ వైపు ప్రభు త్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కార్యాకలపాలు ఇప్పటికే మొ దలయ్యాయి. ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సుల సేకరణ సైతం పూ ర్తైంది. అలాగే ఎన్నికల సిబ్బందికి సంబంధించిన జాబితాలను శాఖల వారీగా రూపొందించాలని ఎన్నికల సంఘం అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. దీంతో ఉద్యోగుల పేర్లు, వారు నిర్వహిస్తున్న పోస్టులు లాంటి పూర్తి వివరాలతో కొద్ది రోజుల్లో జాబితాలు సైతం పూర్తి కానున్నాయి. అయితే ప్రభుత్వం 500 లకు పైగా జనాభా ఉన్న తండాలు, గూడాల ను పంచాయితీలుగా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. గడువు ప్రకారం ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే మాత్ర మే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కొత్త గ్రామ పంచాయితీలకు సంబంధించి ఏలాంటి చర్యలు మొదలు కాలేదు. ఇప్పటికే వీటికి సం బంధించిన వివరాలు సేకరించినప్పటికీ ఏర్పా టు ప్రక్రియకు సంబంధించి కార్యాచరణ మొ దలు కాలేదు. ఒవైపు ఎన్నికలు గడువు సమీపిస్తుండడం మరో వైపు కొత్త పంచాయితీల ఏ ర్పాటు ప్రక్రియ మొదలు కాకపోవడం లాంటి అంశాలు ఎన్నికకు ఆటంకాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ప్రభు త్వం సాధారణ ఎన్నికలను కూడా ముందస్తుగానే నిర్వహించవచ్చ ప్రచారం ఉపందుకున్న క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివకే జనాభా సం ఖ్యను పరిగణలోకి తీసుకొని కొత్త గ్రామ పం చాయతీల ఏర్పాట్లకు సంబంధించి జాబితా సై తం సిద్ధం చేశారు.
దీనికి సంబంధించిన పూర్తి నివేదికలు ప్రభుత్వం చెంత ఉన్నాయి. ప్రభు త్వం ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకొని కారణంగా ఇదే సాకుతో పంచాయతీ ఎ న్నికల నిర్వహణలో జాప్యం జరగవచ్చన్న ప్ర చారం సైతం మొదలైంది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగబోనున్నట్లు ప్రచారం మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగనున్నప్పటికి పరోక్షంగా మాత్రం పార్టీ ప్రభావం తప్పని సరిగా ఉంటుందనే విషయం బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను గతానికి భిన్నంగా పరోక్ష పద్దతిలో నిర్వహించేందుకు కూడా సిద్దమవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఓటర్లంతా సర్పంచ్‌ను పత్యేక్షంగా ఎన్నుకుంటున్నారు. వీరికి తోడుగా వార్డు సభ్యులను సైతం ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం చేపట్టే ఎన్నికల మార్పు ప్రక్రియ కారణంగా సర్పంచ్‌ను వార్డు సభ్యులు ఎన్నుకునేట్లు ప్రభుత్వం విధాన రూపకల్పన చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యుల్లో మెజార్టీ సభ్యులు తమలో ఓ సభ్యుడిని సర్పంచ్‌గా ఎన్నుకునే విధానంపై ప్రభుత్వం యోచిస్తుందంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సారి జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాస్త్ర, సాంకేతిక పద్దతుల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్ పద్దతిలో చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.