Home తాజా వార్తలు ఊపందుకున్న ప్రజలవద్దకు పంతుళ్లు..

ఊపందుకున్న ప్రజలవద్దకు పంతుళ్లు..

ఎల్లారెడ్డిపేటలో గ్రామగ్రామాన బడిబాట

Govt Teachers

 

మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రజల వద్దకే పంతుళ్లు అనే నినాదంతో బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ముమ్మరంగా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు ఎందులోనూ తక్కువ కాదని, చివరికి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంగ్లమాధ్యమంలో సైతం విద్యాబోధన చేస్తూ, సకల వసతులు కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్‌నగర్ గ్రామంలో  ఉపాధి పనులు జరిగే చోటుకు వెళ్లి తమ పాఠశాలలో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన గురించి తెలుపుతూ తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయాలని ఉపాధ్యాయులు ఆగ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృతరాజమల్లు, ఉపసర్పంచ్ ఎల్లయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు, ప్రధానోపాధ్యాయులు బావికాడి రాంచంద్రం, ఉపాధ్యాయులు మౌలానా, పద్మ, లక్ష్మి, జగన్, నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ పులిరాజు, గ్రామ యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

Govt Teachers Campaign for School at 100 Days Work