Home తాజా వార్తలు వచ్చే నెల నుండి రుణాలు చౌక

వచ్చే నెల నుండి రుణాలు చౌక

RBI

 

రెపో రేటు వడ్డీ రేట్ల అనుసంధానం తప్పనిసరి
బ్యాంకులకు ఆర్‌బిఐ సూచనలు జారీ

ముంబై : వచ్చే నెల నుంచి చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రుణాలు చౌక కానున్నాయి. ఈ మేరకు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) అన్ని బ్యాంకులకు సూచనలు జారీ చేసింది. ఈ రుణాలు ఇప్పుడు రిజర్వు బ్యాంక్ ప్రకటించే రెపో రేటుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో చిన్న వ్యాపారు లుప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. గృహ, వ్యక్తిగత, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లకు రెపో రేటును వేగంగా అమలు చేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ ఆదేశించింది.

కొత్త వ్యక్తులకూ ప్రయోజనం
అక్టోబర్ 1 నుంచి అన్ని రకాల వ్యక్తిగత, రిటైల్, చిన్న వ్యాపారాలకు బాహ్య బెంచ్ మార్క్ కింద రుణాలు ఇస్తామని ఆర్‌బిఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎంసిఎల్‌ఆర్ (వడ్డీ రేటు ఆధారిత కరెంట్ మార్జినల్ నిధి వ్యయం) కింద బ్యాంకుల వడ్డీ రేటు మార్పు బదిలీలో పలు కారణాలు చూపడం సమంజసంగా లేదని ఆర్‌బిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకులు అన్ని కొత్త రుణాల వడ్డీ రేట్లు వ్యక్తిగత, రిటైల్, ఎంఎస్‌ఎంఇలకు రెపో రేటుతో అనుసంధానించడం తప్పనిసరి అని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.

ఎఫ్‌డి రేట్లను తగ్గించిన రెండు పెద్ద బ్యాంక్‌లు
రెండు పెద్ద బ్యాంకులు ఎఫ్‌డి (ఫిక్స్‌డ్ డిపాజిట్ల)పై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో కోట్ల మంది వినియోగదారులు నష్టపోనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (హెచ్‌డిఎఫ్‌సి) బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. ఈ రేట్ల తగ్గింపుతో ఖాతాదారులపై ప్రభావం పడనుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పిఎన్‌బి రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. అలాగే 7- 45 రోజుల ఎఫ్‌డిపై బ్యాంక్ 4.5 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఈ వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది. అంతకుముందు ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.50 శాతంగా ఉంది. పిఎన్‌బి 180- 270 రోజులలో వడ్డీ రేటు 6 శాతం, 6.5 శాతంగా ఉంది. ఇది కాకుండా, 271 రోజుల నుండి సంవత్సరానికి వడ్డీ రేటు 6.25 శాతం, 6.75 శాతంగా ఉంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై 3.50 శాతం నుండి 7.10 శాతం వరకు వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. ఈ రెండు బ్యాంకుల మార్పులు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ కూడా ఎఫ్‌డి వడ్డీ రేట్లను తగ్గించింది.

Govt to miss fiscal deficit target despite getting RBI money