Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ప్రభుత్వ విప్ కాన్వాయ్ లోని వాహనం బోల్తా… ఒకరి పరిస్థితి విషమం

ప్రభుత్వ విప్ కాన్వాయ్ లోని వాహనం బోల్తా… ఒకరి పరిస్థితి విషమం

అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శివారులో శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజులుగా గుర్తించారు. చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రభాకర్ రెడ్డి తనయుడు ఆళ్లగడ్డ ఎంఎల్‌ఎ గంగుల బ్రిజేంద్రరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కడప విమానాశ్రయానికి వెళ్తుండగా వాహనం టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

 

Govt Whip Gangula Convoy Vehicle Roll Over