Wednesday, April 24, 2024

నేతన్నల కళా నైపుణ్యం ప్రపంచానికి తెలియాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

రాజన్న సిరిసిల్ల: భారతదేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ వరంగల్, సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశామని ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో సోమవారం పలు అభివృద్ది పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.14.50 కోట్లతో టెక్స్ టైల్ పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభించి నేతన్నకు జీవనోపాధి కలిగించేందుకు ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం కృషి చేసిందని, యజమానులు కార్మికులతో ఒప్పందం చేసుకున్న విధంగా వ్యవహరించాలన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వపరంగా నేతన్నలకు చేయూతనందిస్తామన్నారు. నేతన్నలను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

Govt will help to Handloom Workers amid Lockdown: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News