Home జాతీయ వార్తలు దేశమంతటా ఎన్‌ఆర్‌సి అమలు: అమిత్ షా

దేశమంతటా ఎన్‌ఆర్‌సి అమలు: అమిత్ షా

రాంచి: దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సి) అమలుచేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం వెల్లడించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించడానికి ఎన్‌ఆర్‌సి ఉపయోగపడుతుందని ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా, బ్రిటన్, రష్యాలో అక్రమంగా భారతీయులెవరైనా నివసించగలరా అని ఆయన ప్రశ్నించారు. చట్టపరమైన అనుమతి లేకుండా ఇతర దేశస్తులు మన దేశంలో ఎలా నివసిస్తారని ఆయన ప్రశ్నించారు. అందుకోసమే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలు చేయవలసిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఎన్‌ఆర్‌సిని అస్సాంలో మాత్రమే ఇప్పటివరకు అమలు చేశారు. ఆగస్టు 31న ఆ ప్రక్రియ అస్సాంలో పూర్తయింది. అది అస్సాం రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కాదని అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సిని దేశమంతటా విస్తరిస్తామని, దేశంలో నివసిస్తున్న పౌరులందరి పేర్ల జాబితాను తయారు చేస్తామని ఆయన చెప్పారు.
‘Govt will implement NRC countrywide’: Amit Shah
Union Home Minister Amit Shah reiterated the need for the NRC to detect illegal aliens in the country.