Friday, March 29, 2024

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలకు టిఆర్‌ఎస్ ఇంచార్జీల నియామకం

- Advertisement -
- Advertisement -

Graduate MLC elections incharge in Warangal

మనతెలంగాణ/హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిలపై టిఆర్‌ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి,టిఆర్‌ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాలమేరకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గం ఎంఎల్‌సి ఎన్నికలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలను నిమించినట్లు ఎంఎల్‌సి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,

మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా ప్రకటించారు. వరంగల్ అర్బన్ ఏరియా కో అర్డినేటర్లు గా ఎంఎల్‌సి కడియం శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపి పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండాప్రకాష్‌లను నియమించారు. వరంగల్ తూర్పుకు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ తుమికి రమేష్ బాబు, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకుడు నీలం రాజు కిషోర్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమానికి పులిసారంగపాణి, సింగిరెడ్డి సుందర్ రాజ్, శాసనమండలి ప్రభుత్వ ఛీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,

జనగామకు జనగామ జెడ్‌పి చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, టిఆర్‌ఎస్‌వి నాయకుడు మేడారపు సుధాకర్, రాష్ట్ర వికలాంగుల ంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, పాలకుర్తికి జన్ను జకార్యా, లింగాల జెడ్‌పిటిసి గుడి వంశాధర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌కు వరంగల్ అర్బన్ జెడ్‌పి చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్,టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాంబారి సమ్మారావు వర్ధన్న పేటకు ఎంఎల్‌ఎ వొడితల సతీష్ బాబు, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాలకు గొట్టి ముక్కుల కేశవ్‌రావు, జన్ను పరం జ్యోతి, భూపాలపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్టమధు,

మాజీ రాష్ట్ర చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎంపి మాలోతు కవిత, ములుగుకు వాటర్ బోర్డు చైర్మన్ వీరమల్ల ప్రకాష్, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, గుండాల మధన్ కుమార్, నర్సంపేట ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, వరంగల్ మార్కెట్ చైర్మన్ చింతం సదానందం, డోర్నకల్‌కు మహబూబాబాద్ గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, జనగామ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, మహబూబాబాద్ నియోజకవర్గానికి రైతువిమోచనా చైర్మన్ నాగుర్ల వెంకన్న, టిఆర్‌ఎస్ రాష్ట్రనాయకుడు నూకల శ్రీరంగారెడ్డిలను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News