రాకపోకలకు అవస్థలు పడుతున్న ప్రయాణికులు
రాత్రివేళలో నరక యాతన, ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది?
బాన్సువాడ రూరల్: ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే రహదారుల పక్కన రైతులు వరి ధాన్యం వేస్తుండటంతో రాకపోకలు సాగించే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో నరక యాతన పడుతున్నామని, ఏ చిన్న ఎమర పాటుకు లోనైనా ప్రమాదానికి గురై గాయాల బారిన పడుతున్నామని, ఒక్కొక్క సారి ప్రాణాలు పోయే పరిస్థితులు లేకపోలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సీజన్ కావడంతో రైతులు తమ పంట పొలాల్లో వరి ధాన్యం వేసుకుంటే ఎవ్వరికి ఏ ఇబ్బందులు ఉండవని, ఇలా రాకపోకలు సాగించే రహదారులపై వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించరూ…?
ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించి రహదారుల పక్కన వరి ధాన్యం వేయకుండా చూడాలని సంబంధిత అధికారులను వాహనదారులు కోరుతున్నారు. అలాగే ఇరుపక్కల ధాన్యం కుప్పలు వేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఏదైనా పెద్ద ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పక్కన వరి ధాన్యం కుప్పలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Grain on Roads is Causes to Traffic Interruption in Banswada