Home జాతీయ వార్తలు ఘనంగా జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల ప్రదానోత్సవం…

ఘనంగా జాతీయ ఫోటోగ్రఫీ అవార్డుల ప్రదానోత్సవం…

NATIONAL-PTG-DAY-DONE-IN-PTన్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో సోమవారం 5వ జాతీయ ఫొటోగ్రఫీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైట్లీ ప్రముఖ ఫోటో జర్నలిస్టు భావన్ సింగ్‌ను సత్కరించి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఆయన దాదాపు 5 శాబ్ధాలుగా సేవలందిస్తూ ఎన్నో ప్రముఖ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు తీశారు. ఔత్సాహిక, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ విభాగాల్లో అవార్డులను అందజేశారు. కశ్మీర్‌కు చెందిన జావెద్ అహ్మద్ దార్ అనే ఫోటో జర్నలిస్టు కశ్మీర్ వరదల సమయంలో ‘సేవ్ మదర్ ఎర్త్’ థీమ్‌తో తీసిన ఫొటోలకు గాను ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ సందర్శించారు.