Wednesday, March 22, 2023

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహుడి అలంకార సేవ

- Advertisement -

gutta

*యాదాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ్మ స్వామి ఆలయ యాదాద్రి క్షేత్రంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. శ్రీ వారి అధ్యయనోత్సవాలు డిసెంబర్ 29 నుంచి జనవరి మూడు వరకు బాలాలయంలో అత్యంత వైభవంగా ఆరు రోజుల పాటు జరిగాయి. చివరి రోజు అయిన బుధవారం రోజున శ్రీ లక్ష్మీనరసింహుడికి అలంకార సేవను ఆలయ అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహ్మ స్వామి ఆలయ యాదాద్రి క్షేత్రంలో శ్రీవారి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. శ్రీ వారి అధ్యయనోత్సవాలు డిసెంబర్ 29 నుండి జనవరి మూడు వరకు బాలాలయంలో అత్యంత వైభవంగా ఆరు రోజుల పాటు జరిగాయి. చివరి రోజు అయిన బుధవారం రోజున శ్రీ లక్ష్మీనరసింహుడికి అలంకార సేవను ఆలయ అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో శ్రీ వారి సన్నిధిలో పారయణికులిచే పారాయణాలను, మూల మంత్ర జపములను శా స్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి లోక రక్షణకై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహుని చూడ ముచ్చటగా అలంకరిం చి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ వారి అలంకార సేవను మేళ తాళాల మధ్య అర్చకు లు, వేద పండితులు మంత్రోచ్ఛరణ చేస్తూ బాలాలయ ఆవరణలో ఊరేగింపు చేశారు. ఆలయ ప్రధాన అర్చకు లు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టతను భక్తకోటికి తెలియచేశారు. అనంతరం అధ్యయనోత్సవ సాంప్రదాయములో స్నపన తిరుమంజన మహోత్సవములు, భగవద్రామానుజుల వేడుకలు ఇరామానుషనుత్తాందారి ప్రబంధ అధ్యయనములతో వేడుకలను నిర్వహించి భక్తకోటికి శ్రీ స్వామివారి ఆశీస్సులు అందచేయుచు ఉత్సవ పరిసమాస్తి గావింపబడినట్లు తెలిపారు. ఈ వేడుకలలో ఆలయ ఈవో గీత, చైర్మన్ నర్సింహమూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News