Home జయశంకర్ భూపాలపల్లి పంచాయతీలకు పైసలచ్చినయ్…

పంచాయతీలకు పైసలచ్చినయ్…

 panchayats

 

జిల్లాలో గ్రామాల అభివృధ్దికి రూ. 6 కోట్లు మంజూరి
ఎన్నికైన 7 నెలలకు గ్రామ సచివాలయాలకు కేటాయింపులు
జనాభా ప్రాతిపదికగా ఇచ్చిన నిధులు
ఊరట చెందిన సర్పంచ్‌లు
ఇక అమలు చేయనున్న గ్రామ కార్యాచరణ ప్రణాళిక

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో గ్రామపంచాయతీలకు ఇంత కాలానికి మంజూరైన రూ. 5,90,11,762 లతో అవి సర్వతోమాఖాబివృద్ది చెందనున్నాయి. దీనితో సర్పచ్‌లకు ఊరట కలిగించినట్లయింది. కేటాయించిన పైసలతో గ్రామ సచివాలయాలకు మంచి రోజులు రావడమే కాకుండా అవి కొత్త కల సంతరించుకోనున్నాయి. ఎన్నికయ్యామన్న పేరే తప్ప ఊళ్ళో ఏ పనిచేద్దామంటే పంచాయితీలలో పైసలు లేక ఇంతకాలం కుమిళిపోయిన సర్పంచ్‌లకు జనాబా ప్రాతిపదికన మంజూరైన నిధులు వారికి ఊరట కలిగించాయి. 30 రోజుల ప్రణాళిక ఒకవైపు అమలు జరుగుతున్న సమయంలోనే పంచాయితీలకు జరిగిన ఈ కేటాయింపులు గ్రామాల పురోగతికి మరింత బలం చేకూర్చనున్నాయి.

కొన్ని గ్రామాల సర్పంచ్‌లైతే తప్పని సరి పరిస్థితిలో పురోగతి పనులకు అప్పులు తెచ్చి ఖర్చుచేయడం జరిగింది. అయితే ఇప్పుడు మంజూరైన నిధులతో ఆ విధమైన సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 236 పంచాయితీలుంటే వాటి అభివృధ్దికి ప్రభుత్వం తాజాగా 14 వ ఆర్ధిక సంఘం నిధులతో పాటు ఎస్‌ఎఫ్‌సి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పంచాయితీలకు 2011 జనాబా లెక్కల ప్రకారం మొత్తం 3,53,825 మంది జనాబా ఉన్నది.

మండలాల వారిగా నిధుల కేటాయింపులు
భూపాలపల్లి మండలానికి రూ. 49,35,260 , గణపురం మండలానికి రూ. 59,96,156, రేగొండ మండలానికి రూ. 99,40,567. మండలానికి 46.67.405. చిట్యాల మండలానికి రూ. 62,23,3318. మొగుళ్ళపల్లి రూ. 59,87,656, మల్షర్ రూ. 42,26,767. మహాముత్తారం రూ. 43,88,374. మహాదేవ్‌పూర్ రూ. 52,17,952. పలిమెల రూ. 12,01,334. కాటారం రూ. 62,26,976 లు. ఈ విధంగా ఈ జిల్లాలో ఎఫ్‌ఎఫ్‌సి ద్వారా రూ . 2,36,74,323, ఎస్‌ఎఫ్‌సి ద్వారా 3,53,37,439. మొత్తం రూ. 5,90,11,762లు ఒకేసారి నిధులు మంజూరయ్యాయి. అట్టి నిధులతో ఆయా పంచాయితీలకు సంబంధించి ట్రెజరీ కార్యాలయాలలో జమవుతున్నాయి. వీటితో అభివృద్ది పనులు పరుగులు పెట్టి గ్రామాలు పురోగతి చెందనున్నాయి.

నిధులతో అభివృధ్ధి
ఇంతకాలానికి విడుదలయిన ఆ నిధులతో నిర్ధేషించిన పనులు చేయడానికి సర్పంచ్‌లు గ్రామాలలో వేసుకున్న రూపకల్పనతో ప్రణాళిక బద్దంగా అభివృద్ది పనులపై దృష్టి సరించడానికి సమయాత్తమౌతున్నారు. గత ఫిబ్రవరి 2న పదవీ భాద్యతలు స్వీకరించిన సర్పంచ్‌లకు అప్పటి నుండి పనుల చేద్దామంటే పైసలు లేని కారణంగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఇబ్బంది పడ్డవారికి ఈ కేటాయింపులతో పరిష్కారం దొరకింది. ఈ నిధులతో పారిశుద్య పనులతో పాటు, నీటి సరఫరా, విధ్యుత్తు లైట్ల కొనుగోలు దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ వంటి వాటికి వినియోగిస్తారు.

5 గ్రామాలకు రాని నిధులు
అంతకు ముందు భూపాలపల్లి మండలంలో 19 గ్రామపంచాయితీలుంటే వెంకటాపురం (ము) మండలం నుండి విభజింపబడ్డ సుబ్బక్కపల్లి, పెద్దాపురం, గుర్రంపేట, రాంనాయక్ తండా, బావుసింగ్‌పల్లి వంటి ఈ 5 పంచాయితీలు ఇప్పుడు ఈ మండలంలో చేరడంతో వాటి సంఖ్య 24 కు చేరింది. ఈ విలీన గ్రామాలకు ఏ కారణం చేతనో నిదులు కేటాయింపు జరగలేదు. ఈ దిశగా దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అభివృద్దికి అలంకారం
30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గ్రామాల సమగ్ర అభివృద్దికి దారి సుగమనం అవుతున్న ఈ సమయంలో పంచాయితీల పురోగతికి మంజూరైన ఈ నిధులు వాటి అభివృద్దికి మరింత అలంకారం కానున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ , ఎమ్మేల్యే వంటి వారు ఆ కార్యక్రమం సందర్బంగా గ్రామాలకు వేళ్ళినప్పుడు వారే స్వయంగా చెత్త నివారణ పనుల్లో నిమగ్రమౌతున్నారు.

పిచ్చి మొక్కలను తొలగించడం, దోమలతో వ్యాధులు ప్రబలకుండా సైడ్‌కాలువలలోని చెత్తను తొలగించి వీధులను శుబ్రం చేయడం వంటి పనుల జరుగుతున్నాయి. హరిత హారంలో భాగంగా చెట్లను కూడా నాటుతూ భవిష్యత్తులో గ్రామాల పచ్చదనం కోసం పాటుపడుతున్నారు. ఈ క్ర మంలోనే ప్రభుత్వం జమిలీ గా మంజూరు చేసిన ఈ నిధులతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ది చెందనున్నాయి.

Grants to gram panchayats