Home రంగారెడ్డి గ్రేటర్‌లో గులాబీ గుబాలింపు ఖాయం

గ్రేటర్‌లో గులాబీ గుబాలింపు ఖాయం

జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
TRSమన తెలంగాణ/రంగారెడ్డి: గ్రేటర్ ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్‌లోని అత్తాపూర్ 61వ డివిజన్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలవురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని చూసి అన్ని పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్‌లు, ఆసరా పింఛన్‌లు వంటి పథకాలు చాలా మంది పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయన్నారు. గ్రేటర్ ఎన్నికలలో వరంగల్ ఎన్నికల మాదిరిగానే ఫలితాలు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు బంగి శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, రాంరెడ్డి, శివకుమార్, శ్రీనివాస్, జయదేవ్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.