Thursday, April 25, 2024

ఫ్రాన్స్ నుంచి మూడు యుద్ధనౌకలు కొనబోతున్న గ్రీస్

- Advertisement -
- Advertisement -
France Greece deal
అంకారకు ముప్పేమిలేదని భరోసా

పారీస్: మూడు యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందాన్ని ఫ్రాన్స్, గ్రీస్ దేశాలు మంగళవారం కుదుర్చుకున్నాయి. కోట్లాది యూరోల ఈ ఒప్పందంను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పొగిడారు. ఇది రెండు పెద్ద దేశాల నడుమ కుదిరినప్పటికీ యూరొపియన్ యూనియన్ రక్షణ అభిలాషలకు ఊతం ఇస్తుందన్నారు.
బెల్హర్రా ఫ్రిగేట్స్ కొనుగోలుకు సంబంధించిన అవగాహనపత్రం(మెమొరాండం)పై రెండు వారాల్లోగానే ఒప్పంద సంతకాలు జరిగిపోయాయి. ఎలీసి ప్యాలెస్‌లో గ్రీకు ప్రధాని కిరాయాకోస్ మిత్సోటాకిస్‌తో సమావేశమయ్యాక మాక్రాన్ మాట్లాడుతూ గ్రీస్ మూడు యుద్ధనౌకలను కొనబోతుందని తెలిపారు. దీనివల్ల మధ్యదరా సముద్రంలో రెండు దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. ఇదిలావుండగా ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం విలువ ఎంత అన్నది తెలియలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News