Home అంతర్జాతీయ వార్తలు కరోనాను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ సాయం

కరోనాను ఎదుర్కోవడంలో గ్రీన్ టీ సాయం

Green tea might help tackle coronavirus

 

లండన్ : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రీన్ టీ సాయపడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గ్రీన్‌టీ లోని ఒక పదార్ధానికి ఈ సామర్థ్యం ఉందని వివరించారు. స్వాన్‌సీ విశ్వవిద్యాలయానికి చెందిన సురేశ్ మోహన్ కుమార్ నేతృత్వం లోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. ఆయన భారత్‌లో ఉన్నప్పుడు ఊటీ లోని జెఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి శాస్త్రవేత్తలతో కలసి పరిశోధనలు సాగించారు. కరోనా వైరస్‌లపై పనిచేసే సామర్థ్యం ఉన్న అనేక సహజ సిద్ధ పదార్ధాలను శోధించామని, ఈ మేరకు కృత్రిమ మేధస్సుతో కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉపయోగించామని చెప్పారు. గ్రీన్ టీ లోని ఒక పదార్ధానికి కొవిడ్ కారక సార్స్ కొవ్ 2 వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తమ పరిశోధన సూచిస్తోందని సురేశ్ వివరించారు. దాన్ని గాలో క్యాటెచిన్‌గా గుర్తించామని, ఇది సులువుగా లభ్యమౌతుందని చెప్పారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశ లోనే ఉందని, మరింత లోతుగా అధ్యయనం సాగాల్సి ఉందని తెలిపారు.

Green tea might help tackle coronavirus