Tuesday, April 23, 2024

వరంగల్‌లో తన మొదటి డిస్‌ప్లే కేంద్రాన్ని ప్రారంభించిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

- Advertisement -
- Advertisement -

వరంగల్: సరియైన అంశాలతో మీ నివాస ప్రదేశాన్ని తీర్చిదిద్దే విషయానికి వచ్చినప్పుడు ఎంతో సుపరిచితమైన పేరు, ఉపరితల పరిష్కారాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇండియా బ్రాండుగా ఉన్న గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇటీవలనే వరంగల్‌లో కందకట్ల గ్లాస్ & ప్లైవుడ్స్ యందు గ్రీన్‌లామ్ ల్యామినేట్స్ యొక్క మొట్టమొదటి ప్రత్యేకితమైన డిస్‌ప్లే కేంద్రాన్ని ప్రారంభించింది.

గ్రీన్‌లామ్ ల్యామినేట్స్ అనేది, నివాసగృహాలు, వాణిజ్య ప్రదేశాలను పరివర్తన చేయడానికి, సుందరీకరణ చేయడానికై అత్యున్నత నాణ్యత గల ఉపరితల పరిష్కారాలను అందించడంలో ఒక పవర్‌హౌస్ గా ఉంది. అత్యున్నత నాణ్యత గల గీటురాళ్ళకు అనుగుణంగా తయారు చేయబడిన వాటి ఉత్పత్తులు, ఎటువంటి వాడకానికైనా సరే సాటిలేని విలువను వాగ్దానం చేస్తూ, ఆకట్టుకునే చక్కదనాన్ని అందిస్తూ వైవిధ్యమైన ఆవశ్యకతలను నెరవేరుస్తాయి. ల్యామినేట్ల కొరకు ప్రారంభించబడిన డిస్‌ప్లే కేంద్రం రాంపూర్, MDL కాజీపేట్‌లో గ్రీన్ నర్సరీకి ఎదురుగా నెలకొల్పబడి ఉంది. అత్యున్నత నాణ్యత గల గీటురాళ్ళకు అనుగుణంగా తయారు చేయబడిన ఉత్పత్తులు, సాటిలేని విలువను వాగ్దానం చేసే ఆకట్టుకునే చక్కదనంతో సమగ్రమైన ఉత్పత్తుల విభాగమును కలిగి ఉంది.

గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రతి పనిలోనూ సృజనాత్మకతను జొప్పిస్తూ, వాటిని పరిపూర్ణమైన అందం, తేజస్సుగల పనులుగా పరివర్తన చేయడం ద్వారా అనేక సంవత్సరాలుగా స్థలాలను సుందరంగా తీర్చిదుద్దుతోంది. దాదాపుగా 100 దేశాలలో ఉపరితల సుందరీకరణ ఉత్పత్తుల లోపున సుప్రసిద్ధి చెందిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానము, సృజనాత్మక పరిష్కారాల మార్గదర్శక సిద్ధాంతాలతో సగర్వంగా తలెత్తుకొని నిలబడుతూ ఉంది. ఉపరితల అలంకరణ రంగములో రెండు దశాబ్దాలకు పైగా అనుభవముతో ఇండియా, అంతర్జాతీయ మార్కెట్లకు అంతర్జాతీయ అలంకరణ పోకడలను పరిచయం చేయడంలో మార్గదర్శిగా ఉంటూ గ్రీన్‌లామ్ తన స్థానమును సుస్థిరం చేసుకుంటూ ఉంది.

అంతర్జాతీయ ప్రమాణాలు, పోకడలు, అత్యున్నత నాణ్యతకు దీటైన సర్వశ్రేష్టమైన ల్యామినేట్లు మాత్రమే అందించబడేలా నిర్ధారించుకుంటూ గ్రీన్‌లామ్ ప్రతి ల్యామినేట్‌నీ డిటెయిల్ పట్ల అత్యంత ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తుంది. నివాసగృహాలు, వాణిజ్య ప్రదేశాలు మరియు బహిరంగ వాతావరణాలకు సరిపోయే విధంగా కొయ్య గరుకు తీరుల నుండి ఘనమైన ఉపరితలాల వరకు, ప్రతి అలంకరణ కూడా దోషరహితంగా పనిచేయడానికై తీర్చిదిద్దబడింది. ల్యామినేట్ షీట్లు యాంటీబ్యాక్టీరియల్, అగ్ని నిరోధకత, వేడిమిని తట్టుకోవడం, గీతలు, ఉబ్బు నిరోధకత వంటి అనేకమైన వైవిధ్య గుణగణాలతో వస్తాయి. వాటి ల్యామినేట్ మరియు కాంపాక్ట్ కలెక్షన్లలో విస్తృత శ్రేణి ఉత్పత్తి కేటగరీలను కూడా అందిస్తాయి.

వీటిలో అనేక ఇతర రూపాలతో, ఉపరితలంపై వ్రేలిముద్రలు-పడని ల్యామినేట్లు, HD-గ్లోస్ ఉపరితలాలు, కౌంటర్‌టాప్ ల్యామినేట్లు, యూనీకోర్ ల్యామినేట్లు, డిజిటల్ లేదా కస్టమ్ ల్యామినేట్లు, కాంపాక్ట్ బోర్డులు, క్లాడింగ్ సొల్యూషన్లు, విశ్రాంతిగది క్యూబికల్స్ చేరి ఉంటాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకకు సంధానకర్తగా శ్రీనివాస చక్రవర్తి చుండూరు, (రీజినల్ సేల్స్ హెడ్ – గ్రీన్‌లామ్ ల్యామినేట్ & అలీడ్) వ్యవహరించారు. ఈ డిస్‌ప్లే కేంద్రము సర్వశ్రీ కె. రాజా ప్రభాకర్ (కన్సల్టింగ్ ఇంజనీర్, RP అసోసియేట్స్ & ఇంజనీర్స్), కె. సత్యనారాయణ రావు (కన్సల్టింగ్ ఇంజనీర్), వీరితో పాటుగా కమలాకర్ మరియు దినేష్ (కందికట్ల గ్లాస్ అండ్ ప్లైవుడ్స్), దేవేష్ మనస్వి దాస్ (సెగ్మెంట్ హెడ్, ట్రేడ్ సేల్స్ – గ్రీన్‌లామ్ ల్యామినేట్ & అలీడ్), శ్రీనివాస చక్రవర్తి చుండూరు (రీజినల్ సేల్స్ హెడ్ – గ్రీన్‌లామ్ ల్యామినేట్ & అలీడ్), దీపక్ పువ్వాడ (సీనియర్ మేనేజర్, గ్రీన్‌లామ్ ల్యామినేట్ & అలీడ్) గార్లచే ప్రారంభించబడింది. ఈ వేడుకకు సుమారు 30 మంది ప్రఖ్యాత కళాశిల్పులు హాజరయ్యారు.

స్టోర్ ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీనివాస చక్రవర్తి చుండూరు, (రీజినల్ సేల్స్ హెడ్ – గ్రీన్‌లామ్ ల్యామినేట్ & అలీడ్) గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్, వరంగల్, ఇలా అన్నారు.  “గ్రీన్‌లామ్ వద్ద మేము, ప్రతి చిన్న పనిలోనూ సృజనాత్మకతను జొప్పించడంలో మరియు దానిని అలంకరణ యొక్క అందమైన, అద్భుతమైన వస్తువుగా మార్చడంలో నమ్మకం ఉంచుతాము. తెలంగాణ రాష్ట్రంలోని మరొక అందమైన నగరమైన వరంగల్‌లో సృజనాత్మక డిస్‌ప్లే కేంద్రాల ద్వారా బ్రాండు దేనినైతే అత్యుత్తమంగా అందించాల్సి ఉందో దానిని అందించి, ప్రదర్శించి చూపడానికి గ్రీన్‌లామ్ వాగ్దానం చేస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఈ మరియొక ప్రారంభోత్సవం ద్వారా, మా కస్టమర్లకు ఒకే చోట విస్తృత శ్రేణి ల్యామినేట్లకు అంతరాయం, విసుగు-లేని ప్రాప్యతను అందించడం ద్వారా మా విభాగమును విస్తరించాలని అనుకుంటున్నాము” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News