Friday, March 29, 2024

ఐసిసి చైర్మన్‌గా గ్రేగ్ బార్‌క్లే

- Advertisement -
- Advertisement -

Greg Barclay as ICC Chairman

 

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్త చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రేగ్ బార్‌క్లే ఎన్నికయ్యారు. ప్రస్తుతం గ్రేగ్ న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన ఐసిసి చైర్మన్ ఎన్నికల్లో గ్రేగ్ అత్యధిక ఓట్లు సాధించి కీలకమైన పదవిని సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో ఆయన ఇమ్రాన్ ఖ్వాజాను ఓడించి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులైలో ఐసిసి చైర్మన్ పదవి నుంచి భారత్‌కు చెందిన శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇమ్రాన్ ఖ్వాజా తాత్కాలిక చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. ఇక ఐసిసి చైర్మన్‌కు తాజాగా ఎన్నికలు నిర్వహించగా ఇందులో గ్రేగ్ విజయం సాధించారు. బార్‌క్లేకు 11 ఓట్లు లభించగా ఖ్వాజాకు ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఐసిసి బోర్డుకు చెందిన 16 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రేగ్ చైర్మన్‌గా ఎంపిక కావడంతో ఇమ్రాన్ ఖ్వాజా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

ఇక తన ఎన్నికకు సహకరించిన సభ్యులకు గ్రేగ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని, క్రికెట్‌ను మరింత ఆదరణ లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో సాధ్యమైనన్నీ ఐసిసి టోర్నమెంట్‌లను నిర్వహించిన క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేయడమే లక్షంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఇందు కోసం అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డు సహకారాలు తీసుకుంటానని తెలిపారు. అందరి సహకారంతో క్రికెట్‌కు సరికొత్త రూపు ఇస్తానని పేర్కొన్నారు. ఇదిలావుండగా బార్‌క్లే న్యూజిలాండ్ క్రికెట్‌లో పలు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే గ్రేగ్ ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. కాగా గ్రేగ్ ఐసిసి స్వతంత్ర చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంతకు మందు శశాంక్ మనోహర్ కూడా స్వతంత్ర చైర్మన్‌గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News