Home జాతీయ వార్తలు జమ్మూకశ్మీర్‌లో గ్రెనేడ్‌ దాడి

జమ్మూకశ్మీర్‌లో గ్రెనేడ్‌ దాడి

Grenade attack in Jammu and Kashmirశ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్ల జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు గ్రెనైడ్‌ దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతోపాటు ఓ పోలీస్‌ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ మెహతా అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాాడి చేయడం చర్చనీయాంశమైంది. గ్రెనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.