Wednesday, April 24, 2024

నమ్మలేని అంశాలతో స్పై మూవీ

- Advertisement -
- Advertisement -

Grey Movie like that Spy thriller

 

ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకూరి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ “గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్‌షిప్, ఓ రివల్యూషన్. గ్రే మన లైఫ్‌లో ఉంది. ఈ స్పై మూవీలో నమ్మలేని అంశాలు ఉంటాయి. శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తాం”అని అన్నారు. నిర్మాత కిరణ్ కల్లాకూరి మాట్లాడుతూ “థ్రిల్లర్ సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News