మన తెలంగాణ/వరంగల్: వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారులు ఎప్పటికప్పుడు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శృతిఓజా అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌ను పరస్కరించుకొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినతుల పరిష్కారానికై అధికారులు సాధ్యమైనంత తొందరగా కృషి చేయాలన్నారు. వివిధ కారణాల వల్ల ప్రజల సమస్యల పరిష్కారం ఆలస్యం అయినప్పటికీ ఖచ్చితంగా ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ మంచి వేదిక అన్నారు. ప్రజలకు సంయమనం, అధికారులకు సమస్య తీవ్రత తెలిసి ఉండడం ఈ రెండు ప్రధానాంశాలన్నారు. అధికారుల పనితీరు ఈ గ్రీవెన్స్ వల్ల బట్టబయలవుతుం దన్నారు. ప్రజల సమస్యల పట్ల దృష్టి పెట్టి వారి పరిష్కార దిశగా పనిచేస్తేనే అధికారుల పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ఈ గ్రీవెన్స్‌లో 28 వినతులు రాగా అందులో టౌన్‌ప్లానింగ్-12, టాక్స్ విభాగం-07, ఇంజనీరింగ్-06, పబ్లిక్ హెల్త్-03 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, ఎస్‌ఈ శివరాజు, ఆర్‌ఎఫ్‌ఒ నారాయణ, సిపి శ్యాం, సిహెచ్‌ఒ సునీల్, ఎసిపి సాం బయ్య, మహిపాల్, లకా్ష్మరెడ్డి, ఈఈ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.