- Advertisement -
తుమకూరు : కర్ణాటక తుమకూరు తాలూకా మల్లసంద్ర గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహంలో సరిగ్గా తాళికట్టే సమయానికి వరుడు గుండెపోటుతో మరణిచాడు. వసంత్‌కుమార్ (33) అనే యువకుడికి మల్లసంద్ర గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరగాల్సి ఉంది. శనివారం రాత్రి రిసెప్షన్ జోరుగానే జరిగింది. కాగా ఆదివారం ఉదయం వివాహ వేళ సరిగ్గా తాళి కట్టే సమయంలో వసంత్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే బంధువులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వసంత్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వరుడి మృతి జీర్ణించుకోలేద వధువు స్పృహ తప్పి పడిపోయంది. దీంతో వివాహం జరగాల్సిన కళ్యాణ మండపంలో విషాదం నెలకొంది.
- Advertisement -