Thursday, April 25, 2024

యావరేజ్ స్టూడెంట్‌గా ఉండడం తప్పుకాదు

- Advertisement -
- Advertisement -

Group Captain Varun Singh's letter to school children

నేను కూడా అలాంటి విద్యార్థినే
మీకు దేని మీద ఇష్టం ఉందో గుర్తించి దాని మీద దృష్టిపెట్టండి.. రాణిస్తారు
తాను చదువుకున్న స్కూలు విద్యార్థులనుద్దేశించి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లేఖ

న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూర్ వద్ద బుధవారం చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 14 మంది ఉండగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బైటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయనప్రస్తుతం బెంగళూరు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 21న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని చండీమందిర్ ఆర్మీ పబ్లిక్ స్కూలులో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదువులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి వరుణ్ సింగ్ ఈ లేఖ రాశారు. ‘ మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడూ బాధపడవద్దు. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండడం తప్పేం కాదు.

ప్రతి ఒక్కరూ 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒక వేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే వారయితే మీకు నా అభినందనలు. ఒక వేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుందని భావించకండి’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘మీకు దేని మీద ఆసక్తి ఉందో దాన్ని గుర్తించండి. దానిలో రాణించేందుకు శ్రమించండి. నేను కూడా చదువులో యావరేజ్ స్టూడెంట్‌నే . ఎప్పుడూ టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్కాడ్రన్‌లో యువఫ్లైట్ లెఫ్టెనెంట్‌గా నియమించినప్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఒక విషయం అర్థమయింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజునుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. అంతేకాక తాను శౌర్యచక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్ఫూరి ్తనింపేలా ఉండే ఈ లేఖప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News