Home జోగులాంబ గద్వాల్ గద్వాల టిఆర్‌ఎస్ పార్టీలో గ్రూ(ని)పుల కుంపట్లు

గద్వాల టిఆర్‌ఎస్ పార్టీలో గ్రూ(ని)పుల కుంపట్లు

TRS

మనతెలంగాణ/ గద్వాలప్రతినిధి: గద్వాలలో టీఆర్‌ఎస్ పార్టీకేమైం ది… వీరికి రైతు, నిరుద్యోగ, ప్రజల సమస్యలు పట్టదా…? అనే ప్రశ్న గద్వాల సామాన్యుల నుంచి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే టీఆర్ ఎస్ పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు… అవినీతి ఆరోపణలు… ప్రత్యారోపణలు…. ఒకరిపై కత్తులు దూసుకుంటూ బలప్రదర్శనలు చేస్తున్నవైనం…. ఈమొత్తం సీను నిశితంగా పరిశీలిస్తే ఎవరు లీడ రో…. ఎవరు నాయకుడో… స్పష్టత లేకుండా కెప్టెన్ లేని నావిక…. నా యకుడు లేని సైన్ంయ… ఇంకా చెప్పాలంటే దిక్కులేని అనాథలు మాది రిగా తయారైందని గులాబీ పార్టీకి చెందిన కిందిస్థాయి లీడర్లు, కార్య కర్తల నుంచి వ్యక్తం అవుతున్న మనోవేదన… గద్వాల అభివృద్ధే తమ ఆశయం అన్న నినాదంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా తెరాస పార్టీ తరపున పనిచేసిన వాళ్లు ఆతరువా త జరిగిన పర్యవసనాలతో చిన్నాభిన్నమైయ్యారు… ఫలితంగా గద్వా ల అభివృద్ధి మరచిపోయి.. సొంత అభివృద్ధే ధ్యేయంగా గ్రూపులు క ట్టారు… కట్టడమే కాదు… ఒకరిపై మరొకరు చేతులు… కాదు… కాళ్లు దువ్వుకుంటున్నారు… గత మూడున్నరేళ్లుగా తెరాస పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే… నిజమనిపించక మానదు.
2014లో కలిసికట్టుగా….: నడిగడ్డలో రాజకీయాలు ఉమ్మడి పాల మూరు జిల్లా కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పార్టీల కంటే కూడ లీడర్లదే పైచేయిగా ఉంటున్న సంగతి నడిగడ్డలోని ప్రతిఒక్కరికి ఎరుకనే. 2014లో జరిగిన సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున డికె అరుణ, తెరాస పార్టీ తరపున బండ్లకృష్ణమోహ న్‌రెడ్డిలు పోటిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భం, తెరాస పార్టీ గాలిబలంగా వీస్తుండడంతో అందరు కూడ తెరాస అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గెలుస్తాడనే ప్రచారం జోరుగా వినిపించింది. దీనికి కారణం బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గెలుపు కోసం అయిజ తిరుమల్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మేల్యే గట్టుభీముడు, మాజీ డీసీసీబీ చైర్మన్ గట్టుతిమ్మప్ప, ఇటిక్యాల మండలానికి చెందిన ఖగునాథ్‌రెడి,్డ మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్…ఇలా చాలా మంది నాయకులు ఒకే తాటిపై వచ్చి శ్రమించారు. అయితే అందరి అంచనాలను తలకిం దులుగా చేస్తూ డికె అరుణ వరుసగా మూడోసారి జయకేతనం ఎగుర వేసి హ్యాట్రిక్ సాధించిన విషయం అందరికి విధితమే. తెరాస పార్టీ వారు ఎమ్మేల్యేగా ఓడిపోయిన తరువాత స్థానిక సంస్థలకు సంబంధిం చి మెజారీటీ లేకపోయినప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా జట్పీ చైర్మ న్ పీఠాన్ని కైవసం చేసుకుని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆతరు వాత చోటుచేసుకున్న వివిధ రకాల రాజకీయా పరిణామాలు చోటుచే సుకోవడంతో మెల్లిగామెల్లిగా ఐక్యంగా కలిసిఉన్న తెరాస నేతల మధ్య అంతరం పెరిగింది. ముందుగా గట్టుభీముడి వర్గం తమకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేకుండా పోయిందని పలు పార్టీ అంతర్గత సమావే శాల్లో తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ బాహటంగానే కృష్ణమోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు… తరువాత బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో తానే అన్ని వ్యవహారాలను చక్కబెట్టానని…. కాని తనకు సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుం టూ నిర్లక్షం చేస్తున్నారని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేస్తూ చివరకు వేరు పడ్డారు. తరువాత జట్పీచైర్మన్ బండారీ భాస్కర్ వంతువచ్చిం ది… తనను కేవలం కుర్చీకే పరిమితం చేస్తూ కట్టడిచేశారని కనీసం చైర్మన్ అనే గౌరవం కూడ లేకుండా పోయిందని ఆదేవన చెంది ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టి ఉండలేనంటూ ఆయన కూడ కృష్ణమోహన్‌రెడ్డి నుంచి వేరుపడ్డారు. ఇలా ఒక్కోక్కరుగా కృష్ణమోహన్‌రెడ్డిని వ్యతిరేకి స్తూ ఎవరికి వారే గ్రూపులు కట్టడం… దీనిపై జిల్లా మంత్రులు దృష్టి సారించి సరిదిద్దేప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితమివ్వలేదు… సరిక దా… గ్రూపులు ఇంకా ఎక్కువైయ్యాయి… ప్రస్తుతం ఏస్థాయికి చేరా యంటే ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకునే తారా స్థాయి కి చేరాయి. అందులో భాగమే తాజాగా హాట్ హాట్‌గా మారిన ధరూరు అవినీతి పంచాయతీ గోల. ఇప్పటికే కార్యదర్శి రాజశేఖర్‌పై సస్పెన్స్‌వే టు పడగా, తెరాస పార్టీకి చెందిన కృష్ణమోహన్‌రెడ్డి వర్గంగా ఉన్న సర్పంచి శ్రీనివాస్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు అందాయి. ఇదంతా తమ ప్రతాపమే అని తెరాసలోని ఒక వర్గం నాయకుడు రంకెలేస్తుంటే… జరుగుతున్న పరిణామాల్ని జిల్లా ఇంచార్జీగా వ్యవహరిస్తున్న నమ్ముకు న్న పెద్ద దగ్గరకు వెళ్లి ఎకరవు పెట్టడం మరో నాయకుడు వంతైంది. ఇలా రోజురోజుకు ఒకరిపై ఒకరు కాలు, చేతులు దువ్వుకుంటూ, మీ సాలు మెలేస్తూ తొడలుకొట్టుకుంటున్నారు. అయితే పరిణామాలను ప రిశీలిస్తున్న రాజకీయవిశ్లేషకులు, ప్రజాసంఘాలు అసలు వీరికేమైం ది… మరీ ఇంతలా బరితెగించి ప్రజాసమస్యలను గాలికొదిలేసి బలప్ర దర్శనలు చేయడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఒకపక్క ప్రకృతి ప్రకోపానికి అల్లాడిపోతున్న రైతన్నల దుస్థితి, పండిన పంటల కు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న దైన్యం, సీడుపత్తి రైతుల ఆం దోళన, నిరుద్యోగ సమస్యలు, పడిలేస్తూ సాగుతున్న నెట్టెంపాడు ప్రాజె క్టు పనులు, గద్వాల ఆర్వోబీ పనులు, గద్వాల-ధరూరు ఆర్‌అండ్‌బీ రహదారి పనులు, మొదలు కాకముందే అవినీతి ఆరోపణలు వెల్లువె త్తుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతలు, మొదలు కాని నేతన్నలకు సంబంధించి చేనేత పార్కు పనులు, (కుర్చీవేసుకున్న ఆర్డీఎస్ సమస్య తీర్చుతా, వాల్మీకులను ఎస్టీ జాబితలో చేర్చడం, గంగపుత్రులను బీసీ-ఏలో చే ర్చడం , మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ వంటి ఎన్నికల హామీలు), ముంపుగ్రామమైన ఆలూరు గ్రామంలో నెలకొన్న సమస్యలు… ఇలా ప్రజాసమస్యలను గాలికొదిలేయడం పట్ల ఒకింత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తలలు పట్టుకుంటున్న మంత్రులు…: గద్వాలలో ఉన్నన్ని గ్రూపు తగాదాలు ఉమ్మడి పాలమూరులో ఎక్కడా లేవని ఇదేపద్దతంటూ జిల్లాకు చెందిన మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే వుంటే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరికలు సైతం వ్యక్తం చేస్తున్నా… గద్వాల నేతల్లో మాత్రం మార్పు రాకపోవడమే కాకుండా డోంట్‌కేర్ అన్న ధోరణీలో వ్యవహరిస్తున్నారు… చూడాలి మరి తెరాస గ్రూపుల కుంపట్లు ఏస్థాయికి చేరుతాయ్యో….?