Home తాజా వార్తలు నడకపై యువతలో పెరుగుతున్న ఆసక్తి

నడకపై యువతలో పెరుగుతున్న ఆసక్తి

Wakingనిడమనూరు (నల్లగొండ) : నేటి జీవన విధానంలో మార్పు రావడంతో తగిన వ్యాయామం లేక శరీరం నియంత్రణ లేకుండా పోతుంది. ప్రజల్లో బీపీ,షుగర్,స్ధూలకాయం వంటి రుగ్మతల భారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు వాకింగ్‌పై ప్రత్యేక శ్రధ్ధ చూపిస్తున్నారు. మైదానాలు, ఖాళీ స్ధలాలు, రహదారుల వెంట చిన్న,పెద్ద తేడా లేకుండా వాకింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నడకతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. గుండె జబ్బులు ,మధుమేహం,క్యాన్సర్,మానసిక ఒత్తిడి,రక్తపోటు,స్ధూలకాయతం, కొవ్వును తగ్గించి జీవిత కాలాన్ని పెంచుతుంది. ఈ నేపధ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా యువత, పెద్దలు నడకను జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో 35సంవత్సరాల నుంచి45 సంవత్సరాల మధ్య వయస్సువారు, వృధ్ధులు ఈ నడకపై ప్రత్యేక శ్రధ్ధ కనబరుస్తున్నారు. నడకను దివ్య ఔషదంగా చెప్పవచ్చు. ప్రతి రోజు 30నిమిషాల సాధారణ నడకతో దాదాపు 75కేలరీలు, వేగంగా నడిస్తే 100కేలరీలు ఖర్చువుతాయి. తద్వారా బరువు తగ్గుతారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడవడం వల్ల డయాబైటిస్‌ అదుపులో ఉంటుంది. రోజు ఉదయం దాదాపు 2400 అడుగులు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజు ఆరుబయట నడక వల్ల్ల విటమిన్‌ డి లోపం రాదు. రొమ్ము,కొలెన్,గర్భాశయ ,క్యన్సర్, వచ్చే రెస్ట్‌ దాదాపు 180శాతం తగ్గుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందేలా శక్తినిచ్చి మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.

వాకింగ్ తో లాభాలు…
*దేహధారుఢ్యాన్ని పెంపొందిస్తుంది.
*ఒత్తిడిని తగ్గించి నిద్రకు ఉపయోగపడుతుంది.
*అధిక బరువును ,కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
*మధుమేహం ,గుండెజబ్బులు అదుపులోకి వస్తాయి.
*కీళ్లు బలపడతాయి. రక్తప్రసరణ వేగవంతమవుతుంది.
*వాకింగ్ ప్రారంభించే వారు మొదట రోజు 5నుంచి 15నిమిషాలు నడిచి క్రమేపి వాకింగ్‌ పెంచాలి.
*వీలైనంత వరకు ఉదయం,సాయంత్రం వాకింగ్ చేస్తే మంచిది.
*రహదారులపై వాకింగ్‌ చేయడం కంటె వీలైతే మైదానాలల్లోనే వాకింగ్ చేయడం మంచిది.
*ఆయిల్‌పుడ్స్‌కు దూరంగా ఉండండిః
*ఆహరంలో ఉప్పు, ఆయిల్ మోతాదు తగ్గించాలి.
*స్థూలకాయులు వె.ఇటేబుల్ సలాడ్స్‌ను తీపుకోవచ్చు.
*ఉదయాన్నే మంచి నీటి ఎక్కువగా తాగాలి. స్వీట్స్‌ను ఉదయం తప్పించి మిగతా సమయంలో తినకుడదు.
*వాకింగ్ చేస్తున్న సమయంలో షుస్ తప్పనిసరిగా వేసుకోవాలి.
*వాకింగ్ చేసేందుకు సరైన షూస్ అందరికి తప్పనిసరి. నడిచేటప్పుడు ఉండే షూస్‌ను వాడాలి. చెప్పలతో వాకింగ్ చేస్తే కాళ్ల నొప్పులు వస్తాయి. వాకింగ్ చేస్తే కాళ్ల నొప్ఫులు, మడమ నొప్పులు వస్తాయి. వాకింగ్ చేసే వారు  అనువైన ,మెత్తాని షూస్‌ను తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. డాక్టర్ సలహ పాటించి వైద్యపరమైన సూచనలతో నిర్ణీత సమయంలో వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ,ఆనందంగా ఉండాలి.
*నడిచేటప్పుడు చేతులు ఊపుతూ శరీరాన్ని నిటారుగా ఉంచాలి.
*వాకింగ్‌ ఆపేముందు వేగాన్ని క్రమేపి తగ్గించాలి.
*నడిచేటప్పుడు వదులుగా ఉండే దుస్తులనే ధరించాలి.
*ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి.
*ప్రతి రోజు 30 నుంచి 45 నిమిషాలు నడిస్తే మంచిది.
*పక్కవారితో సాద్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండాలి.
*నడిచేటప్పుడు శ్వాస నియంత్రణ అవసరం
*హిమోగ్లోబిన్ మరీ తక్కువ ఉంటే వ్యాయమం చేయకుడదు. డాక్టర్ సలహ ప్రకారం మందులు వాడడం మంచిది. కోర్సు పూర్తయ్యాక వాకింగ్ ప్రారంభించవచ్చు.

Growing Interest On Walking