Thursday, April 25, 2024

2014 నుంచి గంగాజలాల నాణ్యతలో వృద్ధి

- Advertisement -
- Advertisement -

Growth in Ganges water quality since 2014

ఇంటర్వ్యూలో ఎన్‌ఎమ్‌సిజి డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా వెల్లడి

న్యూఢిల్లీ : 2014 నుంచి గంగానది తీగగంరం పొడవునా జలాల నాణ్యత అభివృద్ధి చెందుతోందని, నిర్ధారించిన కనీస స్థాయి కన్నా ఎక్కువగానే ఆక్సిజన్ నీటిలో కరుగుతోందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం 97 గుర్తించిన పర్యవేక్షణ ప్రాంతాల్లో దాదాపు 68 ప్రాంతాలు స్నానానికి అనువైన ప్రమాణాలు కలిగిన విధంగా పెరిగాయని వివరించారు. గంగాజల శుద్ది జాతీయ మిషన్ ( నేషనల్ మిషన్ క్లీన్ గంగా) డెరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ( బిఒడి ) పర్యవేక్షక ప్రాంతాలు మొత్తం 53 లో 32 ప్రాంతాలు స్నానానికి అనువైన ప్రమాణాలుగా 2014 లో ఉండగా, 2021 లో అలాంటి ప్రాంతాల సంఖ్య 97 కు పెరిగిందని చెప్పారు.

వీటిలో 68 పర్యవేక్షక ప్రాంతాలు బిఒడి ప్రమాణాలు కలిగిన స్నానానికి అనువైన ప్రాంతాలుగా వృద్ధి చెందాయని వివరించారు. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు గ్రహించే ఆక్సిజనును జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమాణాలతో పోల్చుతారు. బిఒడి ఇంకా పెద్దదైతే ప్రవామంలో వేగంగా ఆక్సిజన్ కరిగి క్షీణించిపోతుంది. అంటే జలప్రాణులకు తక్కువ ఆక్సిజను లభిస్తుందని తెలుసుకోవాలి. ప్రస్తుతం గంగానది పొడుగునా నిర్ధారించిన కనీస స్థాయి ప్రమాణాలు లీటరుకు 5 మిల్లీగ్రాముల వంతున ఆక్సిజన్ స్థాయిలు ఉండాల్సి ఉండగా అంతకన్నా ఎక్కువగానే ఆక్సిజన్ స్థాయిలు కలిగిన జలాలే ఉంటున్నాయని వివరించారు. 2014 నుంచి 2021 మధ్య కాలంలో గంగాజలాల నాణ్యత ఈ విధంగా ఎంతో వృద్ధి చెందిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News