Thursday, April 25, 2024

భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్‌ః నగరంలోని మధురానగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా వెళ్తున్న కారులో ఎండిఎంఎ, కొకైన్, హషీష్ ఆయిల్ ఎల్‌ఎస్‌డి, పొడి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు అసిస్టెంట్ ఎక్పైజ్ సూపరింటెండెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎన్. అంజిరెడ్డి తెలిపారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసి వారి నుంచి 105 గ్రాముల ఎండిఎంఎ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషీష్ ఆయిల్, ఎల్‌ఎస్‌డి 4 బ్లాట్స్, 250 గ్రాముల పొడి గంజాతో పాటు 2 కార్లు, మోటర్ బైక్ 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో నిందితులు ఎ 1 భరత్ తుక్రాల్, ఎ 2 ఎం. రానా ప్రతాప్, ఎ 3 షేక్ ఫిరోజ్ అహ్మద్‌ల నుంచి 18 సూది సిరంజిలు, 9 స్టెరిలైజ్డ్ వాటర్ ఆంపిల్స్, 2 డిజిటల్ ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మెషీన్లు, 3 ఎక్స్ 2 అంగుళాల ఖాళీ సాచెట్లు తదితర సామాగ్రి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

ఈక్రమంలో నిందితులను విచారించగా భరత్ తుక్రాల్ తాను అఖిల్ ఆదిత్య అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కోనుగోలు చేసినట్లు తేలిందన్నారు.కాగా ఈకేసులో నిందితులు బోరబండకు చెందిన అఖిల్ ఆదిత్య, బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి వాసి జిమ్మి, చెన్నైకి చెందిన ఇర్ఫాన్, అబ్దుల్, హైదరాబాద్‌కు చెందిన భరత్‌సింగ్‌ల నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. కాగా వారిపై కేసు నమోదు చేశామని, ఈ కేసులో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Grugs Racket arrested in Ameerpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News