Home తాజా వార్తలు రోజాతో ‘‘ జిఎస్‌టి-2 ’’ తీస్తాడట..!

రోజాతో ‘‘ జిఎస్‌టి-2 ’’ తీస్తాడట..!

GST-2-with-Roja

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సిపి ఎంఎల్‌ఎ, సినీ నటి రోజాపై బూత్ బంగ్లా చిత్ర దర్శకుడు అజయ్ కౌండిన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విదేశీ శృంగార తార మియా మాల్కోవాతో జిఎస్‌టి సినిమా తీశారని, ఆమె బదులు ఎంఎల్‌ఎ రోజాను పెట్టి సినిమా తీసుంటే ఇంగా బాగుండేదన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమి లేదని రోజా ఒప్పుకుంటే తానే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్-2 తీస్తానని ప్రకటించారు. ‘బూత్ బంగ్లా’ ఆడియో వేడుకలో మాట్లాడిన కౌండిన్య… రోజా గారు మా అమ్మలాంటివారని.. చాలా పెద్దామె.. సీనియర్ హీరోయిన్ ఆమెకు నా పాదాభివందనాలు. రోజాగారు ప్రపంచంలోని ప్రతీ సమస్య గురించి మాట్లాడుతారు. కానీ మా సినిమా ఫీల్డ్ గురించి మాత్రం మాట్లాడరు. మా సినిమాలో ఉన్న అమ్మాయిలు, టెక్నిషయన్ల సమస్యలపై అసలే మాట్లాడరు. రాజకీయ నేతల్లో ఒక్కరు తప్పు చేసినా… ఒక్కరు వ్యభిచారంలో దొరికినా ప్రతీ లీడర్ వచ్చి అతనికి సపోర్టు చేస్తారు. కానీ మా సినిమా ఫీల్డ్‌లో ఉన్న ఎవరి గురించి రోజాగారు ఏం పికలేకున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఆర్‌జివి పోర్న్‌స్టార్ మియా మాల్కోవాను పెట్టి జిఎస్‌టి మూవీ తీశారని, ఆమె బదులు ఎంఎల్‌ఎ రోజాను పెట్టి తీసి ఉంటే సూపర్‌గా ఉండేదన్నారు. ఇప్పటికైనా రోజాగారు ఒప్పుకుంటే జిఎస్‌టి-2 తీస్తానని కౌండిన్య సంచలన ప్రకటన చేశారు. ఇదిలాఉంటే కౌండిన్యపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో మరో మెంటలోడని, తప్పతాగి ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడొద్దని, ఇంతకైనా మంచిది ఒకసారి పిచ్చి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని, అసలు ఎవడీ పిచ్చోడు… ఇన్నాళ్లు ఎక్కడున్నాడు అంటూ ఘాటైన విమర్శలతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, తనపై చిన్న చిన్న విమర్శలు చేసేవారినే చిల్చీచెండాడే రోజా మాత్రం ఇంకా ఈ విమర్శలపై స్పందించలేదు. కౌండిన్య చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రోజా ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

“GST-2” with YSRCP MLA Roja!