Home బిజినెస్ జిఎస్‌టి పరిధి 20శాతానికి పెంపు

జిఎస్‌టి పరిధి 20శాతానికి పెంపు

  • ప్రస్తుతానికి శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు
  • జిఎస్‌టి కౌన్సిల్ ప్రతిపాదన

GSTన్యూఢిల్లీ: తొలి జాతీయ పరోక్ష పన్ను జిఎస్‌టి కోసం ప్రభుత్వం, పరిశ్రమ సిద్ధంగా ఉన్నప్పటికీ భవిష్యత్‌లో పన్నులను పెంచవచ్చని ఆందోళన చెందుతున్నాయి. దీనికి కారణం పన్ను రేటును 14 శాతం నుంచి 20 శాతా నికి పెంచాలని గురువారం జిఎస్‌టి కౌన్సిల్ ప్రతిపాదిం చడమే.. భవిష్యత్‌లో జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) బిల్లులో మార్పుల విషయంలో పార్లమెంట్‌కు వెళ్లకుండా దూరంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసు కొచ్చింది. రేట్ల గరిష్ఠ పరితిని మార్పు చేసినా గత ఏడాది అంగీకరించిన నాలుగు శ్లాబ్‌ల రేట్లు 5, 12, 18, 28 శాతాల విధానంలో మార్పు ఉండదు. అయితే భవి ష్యత్ లో తలెత్తే సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా నమూనా చట్టంలో మార్పులను ప్రతిపాదించారని అధి కార వర్గాల సమాచారం. సవరించిన ముసాయిదా జిఎస్ టి చట్టాన్ని గతేడాది నవంబర్‌లో ప్రకటించారు. గరిష్ఠ రేటును 14 శాతంగా నిర్ణయించారు. అంటే 14 శాతం కేంద్ర జిఎస్‌టి, అంతే శాతంలో రాష్ట్ర జిఎస్‌టి.. మొత్తంగా 28 శాతం ఉంటుంది. కేంద్ర/ రాష్ట్ర జిఎస్‌టిల ను సిజి ఎస్‌టి/ఎస్‌జిఎస్‌టిగా పిలుస్తున్నారు. ఈ రేట్లు కేంద్ర, రాష్ట్రాలు ప్రకటిస్తాయి.. అయితే కౌన్సిల్ సిఫార సుల మేరకు 14 శాతం మించకూడదు. ఈ 14 శాతాన్ని మార్పు చేసి 20 శాతానికి మించకూడదని చెబుతున్నారని అధికారులు తెలిపారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్య క్షతన జరిగిన జిఎస్‌టి కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ప్రస్తుత ప్రతిపాదనకు అంగీకరించారు. భవి ష్యత్‌లో పన్ను రేటు పెంచాల్సి వస్తే అనే ప్రశ్న తలెత్త కుండా ఉండేందుకు 20 శాతం గరిష్ఠ పరిమితిని జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించింది. దీనికి గాను ఇక పార్లమెంట్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడిం చారు. అంటే కేంద్ర జిఎస్‌టి, రాష్ట్ర జిఎస్‌టిలు 20 శాతం చొప్పున పరిమితిని కల్గి ఉంటాయి. దీంతో గరిష్ఠ పన్ను పరిమితి 40 శాతం అయ్యే అవకాశం ఉంది.   జిఎస్‌టి ప్రకారం కేంద్రానికి సిజిఎస్‌టి, రాష్ట్రాలకు ఎస్‌జిఎస్‌టి, కేంద్రపాలిత ప్రాంతా లకు యుటిజిఎస్‌టి చట్టాలు ఉంటాయి. మార్చి 9న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జిఎస్‌టిని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిని ఆమోదించిన తర్వాత రాష్ట్రాలు ఎస్‌జిఎస్‌టి బిల్లును తమతమ అసెంబ్లీ సమా వేశాల్లో ప్రవేశపెడతాయి. జులై 1నాటికి జిఎస్‌టిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.