Home ఆదిలాబాద్ గుబుల్.. ఎమ్మెల్యేలకు ట్రబుల్!

గుబుల్.. ఎమ్మెల్యేలకు ట్రబుల్!

mapసీటు ఉంటుందా.. ఊడుతుందా..?
పునర్విభజనపై ఎమ్మెల్యేల ఆందోళన
రెండేళ్లకే మొదలైన మథనం
పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాధన సాగు తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు భయం పుట్టుకుంది. రిజర్వేషన్‌ల మార్పు, మండలాల విభజన తదితర వాటిపై అలజడి మొదలైంది. ఇప్పటికే రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేల్లో తమ సీటు ఉంటుందో, ఊడుతుందోనన్న భయం కనిపిస్తుంది. నియోజక వర్గాల పునర్విభజన అం శాలపై 2026 వరకు నిషేదమున్నప్పటికి రాష్ట్ర పునర్విభ జన చట్టంలో దీని గురించి ప్రస్తావించడంతో సాంకేతి కంగా వెసులుబాటు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిలో భా గంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నియోజక వర్గాల పెం పుపై సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి పెద్దగా అడ్డంకులు లేకపోవడంతో పునర్విజన తప్పదని నాయకుల్లో గుబులు రెకేత్తిస్తోంది. తమ సీటు పోతే ఎక్కడ పోటీ చేయాలో తెలియక ఇప్పటి నుంచే సమాలోచనలు చేస్తున్నారు. లోలోపల మధనపడుతూ ఎమ్మెల్యేల సన్నిహి త వర్గాలు చెబుతున్నారు. జిల్లాలో 10 నియోజక వర్గాలు ండగా రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. నియోజక వర్గాల పెంపు ప్రతిపాధన పార్లమెంటులో నియోజక వర్గా ల పరిధిలో రెండేసి నియోజక వర్గాలు పెరిగే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పశ్చిమ జిల్లాలో రెండు స్థానాలు, తూర్పు జిల్లాలో ఒక స్థానం పెరగ నున్నదంటున్నారు. పునర్విభజన జరిగితే జిల్లాలో శాసన సభ్యుల సంఖ్య 13కు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రెండు స్థానాలు ఎస్సీలు, మూడు స్థానాలు ఎస్టీ లకు రిజర్వులో ఉన్నాయి. తాజాగా మరో స్థానం ఎస్సీల కు కేటాయించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఈ ప్రక్రియ సాగుతుండగా కేంద్రం కూడా కసర త్తు చేస్తుందని న్యాయ పరిశీలన అనంతరం బిల్లు అమలు లో కదలిక వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుండడంతో శా సన సభ్యులకు తమ స్థానాల గుబులు వేదిస్తోంది. పశ్చిమ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ డివిజన్‌లలో ఒక స్థానం పెరిగే అవకాశముండడంతో రిజర్వేషన్ల అమలుతో జాత కాలు తారుమారయ్యే అవకాశముందంటున్నారు. దీనిలో భాగంగానే బేల, తలమడుగు, తాంసి, జైనథ్ మండలాలు ఒక నియోజక వర్గంగా రూపొందనున్నదని చెబుతున్నా రు. అదే విధంగా నిర్మల్ డివిజన్‌లో భైంసా, నిర్మల్ నియో జక వర్గాలతోపాటు మరో నియోజక వర్గం పెరిగే అవకా శముందంటున్నారు. సుమారు లక్ష ఓటర్లను ప్రాతిపది కన తీసుకొని నియోజక వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుండడంతో ఇప్పటి నుంచే సిట్టింగ్‌లు పక్క చూపులు చూస్తున్నట్లు చెబుతున్నారు.