Home ఖమ్మం సారాయి ఏరులు

సారాయి ఏరులు

Gudumba-Kilnsవివిధ మార్గాల్లో పట్టణాలకు తరలింపు, విచ్చలవిడిగా బెల్లం విక్రయాలు
అడపాదడపా కేసులతోనే సరి, పట్టించుకోని ఆబ్కారీశాఖ

మన తెలంగాణ/భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో నాటు సారా ఏరులైపారుతోంది. దొరికితే దొంగలు, లేకుంటే దొరలు అన్నచందంగా మారింది నాటుసారా వ్యాపారుల సంగతి. గిరిజనుల ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో సహజంగా గిరిజన కుటుంబాలు సొంతానికి విప్పపొట్టుతో నాటుసారా కాస్తుంటారు. దీనినే అదునుగా తీసుకుని కొందరు బడా బాబులు వ్యాపారాలు ప్రారంభించారు. గుట్టుచప్పుడు కాకుండా గిరిజన గ్రామాల్లో నాటు కారా కాయిస్తూ…. పట్టణ ప్రాంతాలకు తరలించి వ్యాపారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

వివిధ మార్గాల్లో : పట్టణ ప్రాంతాలకు నాటు సారాను వివిధ మార్గాల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సైకిళ్లు, మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, జీపులు, ఆఖరికి మనుషుల నడుములు కూడా నాటు సారాతరలింపుకు ఉపయోగపడుతున్నాయి. రాత్రివేళల్లో అటవీ మార్గాలద్వారా సైకిళ్లకు క్యాన్లుకట్టుకుని వచ్చి ప్రధాన రహదారికి కోద్దిదూరంలోవేచి ఉంటారు. వివిధ పెద్దవాహనాల్లో అక్కడికి చేరుకునే మధ్యవర్తులు వారివద్ద నుంచి సరుకురుని తీసుకుని అనుకున్నచోటికి చేరవేస్తున్నారు. ఈ అప్పుడప్పుడు దాడులు చేస్తున్న అబ్కారీ సిబ్బంది కోన్ని వాహనాలనుసైతం స్వాదీనం చేసుకుని కేసులు పెడుతున్నారు. ఇలా అడపాదడపాకేసులతోనే సరిపెడుతున్నారు తప్ప నాటు సారాపై ప్రజలను చైతన్యపరిచేందుకు వెనుకంజ వేస్తున్నారు.
మందుబాబుల వీరంగం :
విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్న నాటు సారాతో మందుబాబులు కాలనీల్లో వీరంగం వేస్తున్నారు. లీటర్ల కొద్ది దళారుల వద్దకు వచ్చిన సారాను ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయానికి ఉంచుతున్నారు. ఇలా రెవెన్యూకాలనీ, కొత్తకాలనీ, అశోక్‌నగర్ కాలనీ, సుబాష్ నగర్, జగదీష్ కాలనీ, రాజుపేట ప్రాంతాల్లో ఈ సారివిక్రయాలు జోరుగా ఉన్నాయి. దాడులుచేసిన కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత మళ్లీ మామూలు స్థితే.
విచ్చలవిడిగా బెల్లం విక్రయాలు :
నాటు సారాయికి ఉపయోగించే ముడి సరకుల్లో ఓకటి బెల్లం, ఈ బెల్లాన్ని గుట్టు చప్పుడుకాకుండాతెప్పించుకుని ఆంధ్రా సరిహద్దుల్లోని గృహాల్లో దాచిపెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. భద్రాచలానికి కూత వేటు దూరంలో ఏపి,తెలంగాణ బోర్డర్లు ఉండటంతో సారా, బెల్లం వ్యాపారులకు బాగా కలిసివస్తోంది. పలు అనుమానాలకు తావిస్తున్న ఆబ్కారీ తీరు మారాలని పలువురు అంటున్నారు. మొక్కుబడిగా దాడులు చేయ డమే కాకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని, వెల్లువెత్తుతున్న అనుమానాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.