Thursday, April 25, 2024

మెడికల్ కాలేజీలకు గైడ్‌లైన్స్

- Advertisement -
- Advertisement -

National Health commission Guidelines for Medical Colleges

 

న్యూఢిల్లీ : దేశంలో నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పుడున్న వాటి విస్తరణకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) మార్గదర్శక సూత్రాలను వెలువరించింది. వైద్యవిద్య ప్రామాణికత సాధనలో భాగంగా ఎన్‌ఎంసిని సెప్టెంబర్ 25వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ దశలో తొలిసారిగా కమిషన్ ఈ గైడ్‌లైన్స్‌ను శనివారం ప్రకటించింది. 2021 22 విద్యాసంవత్సరానికి ఎంబిబిఎస్ కోర్సులలో ప్రవేశాలకు నియమనిబంధనలు, అవసరమైన ఏర్పాట్లు వంటి వాటిని ఈ మార్గదర్శక సూత్రాలలో పొందుపర్చినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మెడికల్ కాలేజీల్లో అవసరం అయిన పడకల సంఖ్యను 530 నుంచి 430కి కుదించారు. వంద సీట్ల మెడికల్ కాలేజీకి ఈ పరిమితి ఉంటుంది. 200 సీట్ల కాలేజీకి ఇంతకు ముందున్న పడకల సామర్థం 930 ఉండగా దీనిని ఇప్పుడు 830కి తగ్గించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News