Home జాతీయ వార్తలు ఈ నెలాఖరు వరకు గుజరాత్‌లో రాత్రి కర్ఫ్యూ

ఈ నెలాఖరు వరకు గుజరాత్‌లో రాత్రి కర్ఫ్యూ

Gujarat extends night curfew

అహ్మదాబాద్: రాత్రి కర్ఫ్యూను డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటలవరకు 8 నగరాల్లో కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. కర్ఫూ అమలులో ఉండే నగరాలు.. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావనగర్. జామ్‌నగర్, జునాగఢ్. ఆదివారం గుజరాత్‌లో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 11కు చేరింది. రాజ్‌కోట్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఒక్కో కేసు నమోదయ్యాయి.