Home జాతీయ వార్తలు హెల్మెట్ పట్టని తలకాయకు నో ఫైన్!

హెల్మెట్ పట్టని తలకాయకు నో ఫైన్!

అహ్మదాబాద్: హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన ఒక వ్యక్తిని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించకుండానే వదిలేశారు. గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్ జిల్లా బొడేలి పట్టణానికి చెందిన జకీర్ మెమన్ హెల్మెట్ ధరించకుండా టూవీలర్‌పై వెళుతుండగా ట్రాఫిక్ పోలీసలు పట్టుకున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం కింద జరిమానా కట్టాల్సిందేనంటూ హుకుం జారీచేశారు.అయితే తాను ఈ నిబంధన పాటించలేనంటూ మెమన్ చేతులెత్తేశాడు. అతను చెప్పిన కారణం విని పోలీసులు కూడా అతని అసహాయతపై జాలిపడ్డారు. క్షమించి వదిలేశారు. అయితే మెమన్ చెప్పిన కారణమేమిటంటే..తన తలకు సరిపడా హెల్మెట్ మార్కెట్‌లో ఎక్కడా దొరకడం లేదట. నీకున్న పెద్ద తలకాయకు తగ్గ హెల్మెట్ మేము ఇవ్వలేమంటూ హెల్మెట్ దుకాణందారులు కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారట. పాపం..మెమన్ మాత్రం ఏం చేస్తాడు..అందుకే అతడిని వదిలేశాము అని బొడేలీ పట్టణ ట్రాఫిక్ ఎఎస్‌ఐ వసంత్ రత్వా అంటున్నారు.

Gujarat Man Escapes Traffic Penalty, His Head is Too Big to Fit in Helmet