Friday, March 29, 2024

మహిళా పోలీసుపై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి బెయిల్!

- Advertisement -
- Advertisement -

Jignesh Mevani gets Bail

గౌహతి: మహిళా పోలీసుపై దాడి చేసిన కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాంలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన ట్వీట్ల కేసులో అస్సాంలోని మరో కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏప్రిల్ 25న  మేవానీపై ఆరోపించిన దాడి కేసులో మళ్లీ అరెస్టు చేశారు. కొత్త కేసులో ఒక మహిళా పోలీసు అధికారి తన పట్ల ఎఎల్ఏ మేవానీ  “దాడి చేసి దౌర్జన్యం” చేశారని ఆరోపించారు.

అస్సాంలోని కోక్రాజార్‌కు చెందిన స్థానిక బిజెపి నాయకుడు అతనిపై ఫిర్యాదు చేయడంతో  మేవానీని అస్సాం పోలీసుల బృందం గుజరాత్‌లోని పాలన్‌పూర్ లో  గురువారం మొదటిసారి అరెస్టు చేసింది. కాగా  ప్రధాని మోడీని విమర్శించింనందుకు తనని అరెస్టు చేయడం అన్నది “ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతీకార రాజకీయాలు”గా అభివర్ణించారు. ఇదిలావుండగా ‘‘ఇది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల కుట్ర.  నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేశారు. వారు దీన్ని ఓ క్రమపద్ధతిలో చేస్తున్నారు. వాళ్లు రోహిత్ వేములకి చేశారు, చంద్రశేఖర్ ఆజాద్‌కి చేశారు, ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు’’ అని ట్వీట్ల కేసులో బెయిల్ పొందిన రోజున విలేకరులతో మేవానీ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News