Saturday, April 20, 2024

గుజరాత్ ఓటర్లు బిజెపికి గుణపాఠం చెబుతారు: గెహ్లాట్

- Advertisement -
- Advertisement -

జోధ్‌పూర్: గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1 నుంచి 5 వరకు జరుగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపార్టీల మధ్య ఉండబోతుంది. ప్రభుత్వ వ్యతిరేకత(యాంటీ-ఇన్‌కంబెన్సీ) తీవ్రంగా ఉంది కనుక గుజరాత్ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పనున్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, నాసి మౌలికవసతి గుజరాత్ ప్రజలను బాధిస్తున్నాయన్నారు. ఆయన డిజిఫెస్ట్ 2022 సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
“ఒకప్పుడు రోడ్లు బాగుండేవి, ఇప్పుడు అలా లేవు. విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం లేదు. అవకాశం కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అతి తక్కువ జీతం ఉంటోంది. ఉద్యోగులు నిరాశతో ఉన్నారు. గుజరాత్ ప్రజల్లో అనేక భయాలున్నాయి” అని గెహ్లాట్ తెలిపారు. గుజరాత్‌లో బిజెపి గత 24 ఏళ్లుగా అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ పోటీపడుతున్నాయి. “గుజరాత్ మోడల్ అంటూ ఏమి లేదు… అంతా మోడీ మోడలే. ఇప్పుడు ప్రజలకు కూడా అది అర్థమైంది. సమస్యలు, బాధలు తీవ్రంగా ఉన్నాయి” అని అశోక్ గెహ్లాట్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News