Home తాజా వార్తలు ’ర‌స్ట్‘ సినిమా షూటింగ్ లో పేలిన తుపాకీ : సినిమాటోగ్రాఫ‌ర్ మృతి

’ర‌స్ట్‘ సినిమా షూటింగ్ లో పేలిన తుపాకీ : సినిమాటోగ్రాఫ‌ర్ మృతి

Gun Explode In Rust Movie Shootingన్యూ మెక్సికో : హాలీవుడ్ సినిమా ’రస్ట్‘ సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది.  న్యూ మెక్సికోలో అలెక్ బాల్డ్విన్‌పై స‌న్నివేశం షూట్ చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ప్రాప్ గ‌న్‌ని కాల్చారు. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫ‌ర్ మృతి చెందారు. సిినిమా ద‌ర్శ‌కుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు న్యూ మెక్సికో పోలీసులు తెలిపారు. హాలినా హ‌చ్చిన్స్, జోయొల్ సౌజా ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డారు. అయితే హచిన్స్‌కి తీవ్ర గాయాలు కావ‌డంతో చనిపోయారని, స్వల్ప గాయాలపాలైన  ద‌ర్శ‌కుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారని వారు పేర్కొన్నారు. రిహార్స‌ల్ స‌మ‌యంలో తుపాకీ పేలిందని పోలీసులు వెల్లడించారు. ’ర‌స్ట్త్‘ సినిమా ఓ 13ఏళ్ల బాలుడు త‌న తాత‌తో క‌లిసి ప‌రారీ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఈ సినిమాకు మిస్టర్ సౌజా దర్శకత్వం వహించారు. ఫ్రాన్సిస్ ఫిషర్ , మిస్టర్ బాల్డ్విన్ ఈ సినిమాలో  ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.