Friday, March 29, 2024

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్

- Advertisement -
- Advertisement -

Gun Misfire at the Nirmal Collector Camp Office

నిర్మల్: నిర్మల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్ అయింది. నిర్మల్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చేతిలో తుపాకీ పేలింది. తూటా దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ ఛాతీకి గాయమైంది. తక్షణమే అతడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ శంకర్ గౌడ్ తుపాకీ శుభ్రం చేస్తుండా మిస్ ఫైర్ అయిందని బాధితుడు తెలిపారు. గన్‌ పేలిన ఘటనలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

 

Gun Misfire at the Nirmal Collector Camp Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News