Home జాతీయ వార్తలు పెళ్లిలోని ఆచారమే అపచారమైంది…గన్ మిస్ ఫైర్ తో పెళ్లి కూతురు అత్త మృతి

పెళ్లిలోని ఆచారమే అపచారమైంది…గన్ మిస్ ఫైర్ తో పెళ్లి కూతురు అత్త మృతి

Marriage

అది హర్యానా రాష్ట్రం. అక్కడ పెళ్లిళ్లను గన్ లను కూడా వాడతారట. అంతే కాదు.. గన్ తో పైకి పేల్చుతారట. అలా చేస్తేనే ఆ జంట పెళ్లి తర్వాత సుఖంగా ఉంటుందట. ఇది ఎప్పటి నుంచో అక్కడ నడిచే సాంప్రదాయం.

కాని, ఆ సాంప్రదాయమే ఓ పెళ్లి ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి వేడుకలు జరుగుతుండగా వాళ్ల ఆచారమైన తుపాకీ కాల్చే వేడుకను ప్రారంభించారు పెళ్లికి వచ్చిన వారు. అయితే, గన్ ను పైకి కాలుస్తుండగా.. మిస్ ఫైర్ అయి.. పెళ్లి వేడుకల్లో ఉన్న పెళ్లి కూతురు అత్త కు ఓ బుల్లెట్ తగిలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది.

ఆ బుల్లెట్లు మరో ముగ్గురు బంధువులకూ తగలడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి ఐపిసి 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఇలాంటి సంఘటనలే ఇదివరకు మన దేశంలో చాలా జరిగాయట. గత మార్చిలో పంజాబ్ లో ఇలాగే పెళ్లి వేడుకల్లో గన్ మిస్ ఫైర్ అయి ఒకరు చనిపోయారట. ఉత్తరప్రదేశ్ లో గత ఫిబ్రవరి లో జరిగిన గన్ మిస్ ఫైర్ లోనూ ఒకరు మృత్యువాత పడ్డారు. ఇంకా వెలుగు లోకి రాని ఘటనలు ఎన్నో.

ఇంత జరిగి ప్రాణాలు పోతున్నా… వాళ్ల కల్చర్ ను మాత్రం వదలట్లేదు ఈ రాష్ట్రాల ప్రజలు. ఇదేం కల్చర్ రా బాబు….